Keeravani - Arjun: ఆర్ఆర్ఆర్ సినిమాలోని ’నాటు నాటు’ పాటతో లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవర్ వరకు అందిరితో నాటు డాన్స్ చేయించిన కీరవాణి.. ప్రపంచ సినీ ప్రేమికులు జీవిత కాలంలో ఎదురు చూసే ఆస్కార్ అవార్డు అందుకొని చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా కీరవాణిని దేశ ప్రధాని సహా అందరు ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కీరవాణి ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా శాలువ కప్పి పుష్ఫ గుచ్ఛం అందజేసారు.
యాక్షన్ కింగ్ అర్జున్ విషయానికొస్తే.. మన దేశంలోనే యాక్షన్ సీక్వెన్స్ చేయడంలో ఈయన తర్వాత ఎవరైనా.. అందుకే మన దేశంలో ఏ హీరోకు లేనట్టు ఈయనకు మాత్రమే యాక్షన్ కింగ్ బిరుదు ఉంది. ఈయన నటుడిగానే కాకుండా.. నిర్మాత, దర్శకుడు, కథకుడు కూడా. వీళ్ల ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఈయన నటించిన కొన్ని చిత్రాలకు కీరవాణి సంగీతం అందించారు.
కీరవాణి విషయానికొస్తే.. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ నాటు నాటుకు (Naatu Naatu won the Oscar) ఆస్కార్ అవార్డ్‌ను చంద్రబోస్‌తో కలిసి అందుకొని చరిత్ర సృష్టించారు. 95 వ అకాడమీ(Oscars) అవార్డులలో తెలుగు సినిమాకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు పాట... ఆస్కార్‌కి దక్కించుకోవడం ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. (Twitter/Photo)
ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటిసారే. అచ్చమైన భారతీయ సినిమాకి దక్కిన తొలి ఆస్కార్గా చరిత్ర సృష్టించింది. నాటు నాటుకు సంగీతం అందించిన కీరవాణి ఆస్కార్ ప్రతిమ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజమౌళిని ఉద్దేశిస్తూ ఓ పాట కూడా పాడారు. ఆస్కార్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట నామినేషన్ పొందింది. ఈ పాటతో పాటు మరో నాలుగు పాటలు (అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్), హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) సినిమాలవి నామినేట్ అయ్యాయి. ఇక ఈరేసులో తెలుగు సినిమా ఆస్కార్ పొంది భారతీయ చలనచిత్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
కీరవాణి విషయానికొస్తే.. బాలమురళీకృష్ణ ఆయనకు బాలమిత్రుడైనట్టు... ఆశా భోంస్లే అక్షరాలా ఆడపడుచైనట్టు... గులాం అలీ ఆప్తుడైనట్టు... ఘంటసాల ఆత్మబంధువైనట్టు... అచ్చమైన స్వచ్ఛమైన సంగీతాన్ని పుణికి పుచ్చుకున్న సంగీత దర్శకుడు... కీరవాణి. భళి భళి భళిరా సాహోరే బాహుబలి అన్నట్టు.. విన్నపాలు వినవలే వింత వింతలు అంటూ భక్తి గీతం వినిపించినా.. బంగారు కోడి పెట్ట.. నాటు నాటు అంటూ మాస్ బీట్ వినిపించిన అది కీరవాణికే సొంతం అనే చెప్పాలి. తన బాణీలతో తెలుగు వారి వాణి వినిపించిన ఆ సంగీత దర్శకుడే కీరవాణి. ఈ యేడాది కేంద్రం ఈయన్ని పద్మశ్రీ పురస్కాంతో గౌరవించింది. రీసెంట్గా ఈయన కీర్తి కిరీటంలో ఆస్కార్ వచ్చి చేరింది. (File/Photo)
రెండు తరాల వారధి, నిజమైన స్వర సారధిగా స్వర సారధ్యం వహిస్తున్నవాడు.. కీరవాణి.ఒక 'ఎం' అంటే మధురమైన... ఇంకో 'ఎం' అంటే మెలోడీ అంటూ తానెవరో ముందే హింటిచ్చేసిన ఎం.ఎం.కీరవాణి తెలుగు పాటకు, ఆ పాటను ఇష్టపడే సంగీత ప్రియులకు ఎన్ని పాటలిచ్చినా ఇంకా ఫ్రీ స్పేస్ ఉన్న మెమొరీ కార్డులా కనిపించాడు. విలువైన పాటల్ని అందించాడు.. అందిస్తూనే ఉన్నాడు. (Twitter/Photo)
కీరవాణి పాటలో లాలిత్యం ఉంటుంది.మనదైన సాహిత్యమూ వినిపిస్తుంది. అందుకే ఆయన పాటంటే తెలుగువారికంత సాన్నిహిత్యం ఏర్పడింది. లాలి పాట ఆయనదే... జాలి గీతమూ ఆయనదే. మెలోడీతో నిద్ర పుచ్చి, కిర్రెక్కించే గీతంతో హుషారు తెచ్చి, ఆవేదన, ఆర్థ్రత నిండిన గానంతో ఆలోచన నింపిన భావుకత కీరవాణికే సొంతం. కెరీర్ మొదట్లో ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి, ఇళయరాజా దగ్గర పనిచేసారు. ఆ తర్వాత ఉషాకిరణ్ మూవీస్ తెరకెక్కించిన ‘మనసు మమత’తో సంగీత దర్శకుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టారు. ఆ తర్వాత అక్కినేనితో తెరకెక్కించిన ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. (file/Photo)
రాలిపోయే పువ్వుకు రాగం పరిచయం చేసిన గళం...వాడిపోయే పొద్దుకు వర్ణాలు అద్దిన స్వరం...జామురాతిరి జాబిలమ్మలకు జోలపాడిన గీతం కూడా ఆయనే. మనసుకు, మనసుకు మధ్య ముడివేసిన నేర్పరితనమూ... అచ్చంగా మన కీరవాణిదే. కీరవాణి ఓ సూపర్ మార్కెట్లాంటోడు. అక్కడ అన్నీ ఉంటాయి. వచ్చినవారు నచ్చింది తీసుకోవడమే. (file/Photo)
దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తర్వాత తమ్ముడు రాజమౌళితో ఆయన ప్రయాణం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. స్టూడెంట్ నంబర్ 1 నుంచి మొదలు పెడితే.. ఆర్ఆర్ఆర్ వరకు ఈయన సంగీతం అందించిన చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అటు ఇతర దర్శకుల విషయానికొస్తే.. కే.విశ్వనాథ్, కోదండరామిరెడ్డి, బాపు, ముత్యల సుబ్బయ్య, రవిరాజా పినిశెట్టి వంటి దర్శకుల సినిమాలకు స్వరాలు అద్దిన ఘనత కీరవాణిదే. Photo twitter)
భీమవరం బుల్లోడికి పాలు, మురిపాలు ఇచ్చినట్టు అటు మాస్, ఇటు క్లాస్ జనాలకు ఏం కావాలో అవి ఇవ్వగలరు కీరవాణి. బంగారు కోడిపెట్ట అయినా.. జుంజుం మాయ అయినా.. అది ఆయన నుండి రావాల్సిందే. ఎవరికీ ఏం కావాలో అవి ఇవ్వగలరు కీరవాణి. ఈయన దగ్గర స్టాక్ అయిపోయే ప్రసక్తే లేదు. అన్నింటికీ లైఫ్ టైమ్ వాలిడిటీ ఉంది. సన్నివేశం కాస్త దిగాలుగా ఉంటే చాలు తన నేపథ్య గీతంతో బాసటగా నిలుస్తాడు. కేవలం నేపథ్య సంగీతంతోనే 'ఇందులో ఏదో విషయం ఉంది' అని భ్రమించేలా చేస్తాడు. ప్రాణం పోసే వాళ్లను డాక్టరు అని పిలిస్తే... సినిమాలకు కీరవాణి ఓ డాక్టరే!
చిన్నసినిమా చేయి పట్టుకొని నడిపించి, తన సంగీతంతో అంతెత్తున నిలబెట్టే కీరవాణి... మ్యూజిక్ డైరక్టర్ కాదు.. మ్యాజిక్ డైరక్టర్. ఈయన కేవలం పాటల మాస్టారే కాదు ఫైటు మాస్టారు కూడా. 'ఛత్రపతి', 'సింహాద్రి' బాహుబలి, ఆర్ఆర్ఆర్ చూసే ఉంటారు. ఈసారి నేపథ్య సంగీతం లేకుండా మళ్లీ చూడండి. ఏదో తగ్గిందనిపిస్తుంది. ఏదో వెలితి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆ వెలితి... కీరవాణి. ఆయన నేపథ్య సంగీతం ఉంటే చాలు రోమాలు నిక్కబొడుస్తాయి. కాగుతున్న రక్తం మరిగిపోతుంది. బస్.. ఫైట్ కూడా అక్కర్లేదు.
కీరవాణి ఓ ఆల్ ఇన్ వన్! స్వరాలతో సరిపెట్టుకోరు. ఆ స్వరానికి తన గాత్రంతో ఇంకాస్త వన్నె తెస్తారు. అవసరమైతే తనలోని భావకుడు నిద్రలేచి ఒళ్లు విరుచుకొంటే ఆ పాటేదో తనే రాసుకుంటారు. ఆ పాటలేవో సరదాకు రాసినట్టుండవు. వాటిలో కొన్ని మనల్ని ప్రశ్నిస్తున్నట్టుంటాయి. ఆయన ఆవేశానికి అక్షరం జోడించినట్టుంటుంది. (File/Photo)
మొత్తంగా చూసుకుంటే.. 2022లో ఆర్ఆర్ఆర్ సినిమాకు రాజమౌళికి ఎంత పేరొచ్చిందో... సంగీత దర్శకుడిగా కీరవాణికి అంతే పేరొచ్చింది. మొత్తంగా నంది అవార్డుల నుంచి మొదలు పెడితే.. అన్నమయ్య సినిమాకు జాతీయ అవార్డు...ఆర్ఆర్ఆర్కు గోల్డెన్ గ్లోబ్, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుతో పాటు 2023లో కేంద్రం నుంచి పద్మశ్రీ.. తాజాగా ఈయన కీర్తి కిరిటంలో ఆస్కార్ వచ్చి చేరింది. ఏది ఏమైనా సప్త సముద్రాల ఆవల ఉన్న అమెరికాలో మనందరికీ కల లాంటి ఆస్కార్ కీరవాణిని వరించడం.. తెలుగు వాళ్లతో పాటు భారతీయులందరకీ గర్వకారణం.