ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేబీసీ సీజన్ 14 అట్ఠహాసంగా ప్రారంభమైంది. 14వ సీజన్ ప్రారంభోత్సవానికీ ఆమీర్ ఖాన్‌తో పాటు మేజర్ డీపీ సింగ్, కల్నల్ మిథాలీ మధుమిత, ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్, భారత్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ వచ్చారు. ఇక ఆమీర్ ఖాన్.. ఈ ఆటలో కల్నల్ డీపీ సింగ్‌తో కలిసి కేబీసీ గేమ్ ఆడారు. (Twitter/Photo)
మిలినియమ్ ఇయర్ 2000లో ప్రారంభమైన ఈ గేమ్ షోలో ఇప్పటి వరకు 13 సీజన్లు అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరించారు. 2008లో మాత్రం షారుఖ్ ఖాన్ ఒక్క సీజన్‌కు మాత్రమే వ్యాఖ్యాతగా వ్యవహరించి మెప్పించలేకపోయారు. ఇక 13వ సీజన్లో సామాన్యలతో పాటు సెలబ్రిటీలు చాలా మంది ఈ షోలో రూ. కోటి రూపాయలు గెలుచుకున్నారు. మరి ఈ 14వ సీజన్ తాజాగా ప్రారంభమైంది. ఇందులో ఎంత మంది కోటీశ్వరులు అవుతారో చూడాలి. (Twitter/Photo)