Victrina: రాజస్థాన్ వేదికగా ఇటీవలే వేడుకగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు కత్రినా కైఫ్- విక్కీ కౌశల్. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఏడడుగులు నడిచి జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. కొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందించారు. కాగా విక్ట్రీనా పెళ్లి వేడుకలు, ప్రివెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు సంబంధించి క్యాట్ దంపతులు సోషల్ మీడియాలో వరుసగా ఫొటోలు షేర్ చేసుకుంటున్నారు. దీంతో అవికాస్తా వైరల్‌గా మారుతున్నాయి.
కత్రినా మరియు విక్కీల ఈ వివాహ వేడుకను పూర్తిగా గోప్యంగా ఉంచారు అంతేకాదు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా, సవాయి మాధోపూర్‌లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కోట 14వ శతాబ్దంలో నిర్మించబడినదిగా తెలుస్తోంది. Photo : Instagram
ఈ వేడుక కోసం క్యాట్ దంపతులు బాలీవుడ్ సెలబ్రిటీలందరినీ ఆహ్వానించారని తెలుస్తోంది. డిసెంబర్ 20న ముంబయిలోని ఓ ప్రముఖ హోటల్ వేదికగా ఈ గ్రాండ్పార్టీని ఏర్పాటుచేసినట్లు సమాచారం. ప్రస్తుతం ముంబయిలో కేసులు పెరుగుతున్నాయి. ఈక్రమంలో పెళ్లి వేడుకల తరహాలోనే రిసెప్షన్ పార్టీ కోసం గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నారట.
ముందస్తు జాగ్రత్తగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అనుమతి తీసుకుని వారు సూచించిన ప్రొటోకాల్స్‌కు అనుగుణంగానే పార్టీ ఏర్పాటుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ముఖ్యంగా స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్, రణ్ బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ తదితర ప్రముఖులకు ఆహ్వానం అందించినట్టు సమాచారం.