మేరేజస్ ఆర్ మేడిన్ హెవెన్ కాదు...మేడిన్ మూవీ లాండ్ అని మన దగ్గర ఉన్న కొంత మంది తారలను చూస్తే నిజమేనని చెప్పొచ్చు.సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంల కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్‌లో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. తాజాగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అలా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సహా వివిధ సినిమా ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎవరున్నారో చూద్దాం..
విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాలో చాలా రాజ శైలిలో వివాహం చేసుకున్నారు. కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్‌ల వివాహం జరిగిన వెంటనే మీడియా ప్రతినిధులకు స్వీట్లు పంచిపెట్టగా, వారి పెళ్లి వార్త కొంతకాలంగా ముఖ్యాంశాలలో ఉంది. రౌండ్లు పూర్తయిన తర్వాత, కత్రినా కైఫ్ బర్వారా ఫోర్ట్ వెలుపల ఉన్న సెక్యూరిటీకి స్వీట్లు పంపింది. (Twitter/Photo)
రీల్ లైఫ్‌లో ఒకటి రెండు సినిమాల్లో జోడిగా నటించిన వీళ్లిద్దరు కొన్నేళ్లు ప్రేమించుకున్న తర్వాత వీళిద్దరు 2018 చివర్లో ఒక ఇంటివాయ్యారు దీపికా పదుకొణే, ,రణ్వీర్ సింగ్ . పెళ్లి తర్వాత వీళ్లిద్దరు ‘83’లో జంటగా నటించారు. అంతేకాదు వీళ్లిద్దరు ఏ సినిమాలో జోడిగా నటించినా.. చనిపోయే క్యారెక్టర్స్ చేశారు. కానీ 83లో మాత్రం భార్యా, భర్తలుగా చనిపోని పాత్రలు చేయడం విశేషం. (Facebook/Photo)
తెలుగు విషయానికొస్తే.. ఏమాయ చేసావే సినిమాతో ఆటోనగర్ సూర్యను నిజంగనే మాయ జేశిన జెస్సీ...ఆ తర్వాత చైతూతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ను ఆఫ్ ది స్క్రీన్ లో కంటిన్యూ చేసి మూడు ముళ్లలతో ఏడడుగులు వేసి ఆలుమగలయ్యారు. కానీ వీళ్లిద్దరు ఈ యేడాది అక్టోబర్ 2న వీళ్లిద్దరు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అభిమానులను నిరాశపరిచారు. (Instagram/Photo)