Celebrities Marriages 2021: ఈ యేడాది 2021లో కరోనాతో ఎంతో మంది సినీ ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు. ఈ యేడాది మొదట్లో సింగర్ సునీత .. ప్రముఖ వ్యాపారవేత్త మ్యాంగో మూవీస్ అధినేత రామ్ వీరపనేనిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వరుణ్ ధావన్, దియా మీర్జా, విష్ణు విశాల్, ఆపై ప్రణీత పెళ్లి పీఠలు ఎక్కారు. అటు బాలీవుడ్ భామ యామీ గౌతమ్ రహస్యంగా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక ‘గొడవ’ ఫేమ్ శ్రద్ధా ఆర్య కూడా మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసింది. ఇక టాలీవుడ్ యంగ్ హీరోగా కార్తికేయ మూడు ముళ్ల బంధంలో అడుగు పెట్టారు. తాజాగా యూరీ ఫేమ్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసారు. మొత్తంగా 2021లో పెళ్లి పీఠలు ఎక్కిన సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారో మీరు ఓ లుక్కేయండి.
నవంబర్ 21న టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఓ ఇంటి వాడయ్యాడు. కార్తికేయ తన స్నేహితురాలు లోహిత రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం హైదరాబాద్ లో బ్రాహ్మణ వేద మంత్రాల సాక్షిగా ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. hero kartikeya wedding pics Photo : Twitter
కార్తికేయ కంటే ముందు హీరోయిన్ శ్రద్ధా ఆర్య వివాహా బంధంలో అడుగు పెట్టింది. ఈమె విషయానికొస్తే.. శ్రద్ధా ఆర్య తెలుగులో ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఆయన తనయుడు వైభవ్ హీరోగా పరిచయమైన ‘గొడవ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు ఈమె పలు టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆపై తమిళ సినిమాల్లో నటించింది. రీసెంట్గా ఈమె దిల్లీకి చెందిన నేవి ఆఫీసర్ రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది. (Twitter/Photo)
బాలీవుడ్ ప్రముఖ కథానాయిక యామీ గౌతమ్ (Yami Gautam) ఈ యేడాదే పెళ్లి పీటలెక్కింది. బాలీవుడ్ డైరెక్టర్ ‘యూరీ’ ఫేమ్ ఆదిత్య ధర్‌తో మూడు ముళ్ల బంధంతో ఏడడుగులతో ఒకటయ్యారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు సహా అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నేడు(శుక్రవారం) వీరి పెళ్లి జరిగింది. (Twitter/Photo)
Singer Sunitha: టాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత జనవరి 9న తేదిన. మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని ఆమె వివాహం చేసుకుంది. దీంతో వీరిద్దరి పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈమె 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సునీత విడాకులు ఇచ్చి కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంది. ఆ తర్వాాత చాలా యేళ్లకు రామ్ వీరపనేనిని వివాహాం చేసుకుంది. (File/Photo)