Katrina Kaif and Vicky Kaushal: కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ పెళ్లి వేడుకకు వెళ్లాలంటే ఇవి తప్పనిసరి..
Katrina Kaif and Vicky Kaushal: కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ పెళ్లి వేడుకకు వెళ్లాలంటే ఇవి తప్పనిసరి..
బాలీవుడ్ స్టార్ కపుల్ డిసెంబర్ 9న సవాయి మాధోపూర్‌లోని ఫోర్ట్ బార్వారాలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లి వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. 120 మంది ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కాబోతున్నారు. అందరూ హై ప్రొఫైల్ వారు కావడంతో పెళ్లికి హాజరు అయ్యే వారికి కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటో ఓ లుక్ వేయండి.
1. బాలీవుడ్ స్టార్ కపుల్ డిసెంబర్ 9, 2021న సవాయి మాధోపూర్‌లోని ఫోర్ట్ బార్వారాలో పెళ్లి చేసుకోబోతున్నారు. వారే కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్. వీరిద్దరి వివాహ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వీరి వివాహ వేడుకకు హాజరయ్యే వారికి పలు షరతులు పెట్టారు.
2/ 7
2. ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ వివాహ వేడుకకు సినీ ప్రముఖలను దాదాపు 120 మందిని ఆహ్వానిచ్చినట్టు సమాచారం. తాజాగా వీరి వివాహ వేడుకలో సెల్ఫోన్లను నిషేధించారు. . (Image: Instagram)
3/ 7
3. దీనిపై చర్చ జరుగుతుంది. దీనికీ కారణం ఉందని కొందరు వాదిస్తున్నారు. ఎంతో గ్రాండ్‌గా నిర్వహించే ఈ వేడుక ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కాకుండా ఉండేందుకే.. పెళ్లికి హాజరయ్యే అతిథులు సెల్‌ఫోన్ తీసుకురాకుండా నిషేధం విధించినట్టు సమాచారం. (Image: Instagram)
4/ 7
5. ఇదిలా ఉండగా, వివాహానికి హాజరయ్యే అతిథులందరూ తప్పనిసరిగా పూర్తి టీకా సర్టిఫికేట్ మరియు నెగెటివ్ ఆర్టి-పిసిఆర్ రిపోర్టును తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజేంద్ర కిషన్ తెలిపారు.
5/ 7
6. హైప్రొఫైల్ వివాహానికి నగరానికి వచ్చే వీఐపీల దృష్ట్యా భద్రతను కూడా చూస్తున్నారు. వివాహ వేడుకలో కోవిడ్ మార్గదర్శకాలను పాటించడం గురించి DC సూచనలు ఇచ్చారు. (Representative Image)
6/ 7
7. శాంతిభద్రతలు, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ మొదలైన వాటి గురించి హోటల్ మేనేజ్మెంట్ మరియు ఇతర సంబంధిత అధికారులకు వివరించారు.(Image: Viral Bhayani)
7/ 7
8. అయితే సెల్‌ఫోన్ నిషేధంపై సన్నిహితులు స్పందించారు. ఇది పుకారని ఈ ఏడాది వచ్చిన పెద్ద జోక్ ఇదే అన్నారు. ఎవరైనా పెళ్లికి వచ్చేవారిని ఫోన్లు తేవొద్దు అని అనగలరా అని ప్రశ్నిస్తున్నారు.