సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్లంతా ఆనందంగా ఉంటారని.. వాళ్లకు డబ్బులకు ఏ మాత్రం లోటు ఉండదని.. అంతా సంతోషమే తప్ప దు:ఖం అంటే ఏంటో తెలియదని చాలా మంది అనుకుంటారు. వాళ్ల ఆలోచనలో కూడా తప్పు లేదు. ఎందుకంటే సినిమా అనేది బయటికి అందంగా కనిపించే ఓ రంగుల ప్రపంచం. కాకపోతే అక్కడంతా ఉండేది అద్దాల మేడలే. బయట నుంచి చూసేవారికి అంతా బ్రహ్మండంగా ఉంటుంది కానీ ఒక్క రాయి కానీ పడిందంటే ఎంత పెద్ద మేడ అయితే కూలిపోవాల్సిందే.
అలాగే ఉంటాయి సినిమా వాళ్ల జీవితాలు కూడా. తెరపై ఎంత అందంగా.. ఆనందంగా కనిపించినా.. జీవితంలో వాళ్లకు కూడా ఎన్నో కష్టనష్టాలుంటాయి. వాళ్లకు కూడా ఎమోషనల్ ఫీలింగ్స్ చాలానే ఉంటాయి. తమకు అవకాశం దొరికినపుడు తమ బాధను చెప్పుకుంటారు. ఇప్పుడు కస్తూరి సీరియల్ నటి ఐశ్వర్య పిస్సె కూడా ఇదే చేసింది. తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంది.
మరోవైపు ఇంకో నటి కూడా ఇదే చేసింది. తన జీవితంలోని విషాదాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతున్న ‘C/O అనసూయ’ సీరియల్‌తో బాగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తేజస్విని.. సీరియల్లో ఈమె పేరు శివాణి. ఈమె మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియకుండాపెరిగానని చెప్పుకొచ్చింది.
అంతెందుకు.. చివరికి తన తండ్రి ఆఖరి చూపుకు కూడా తాను నోచుకోలేకపోయానంటూ ఏడ్చేసింది. తాను ఇంటర్ చదువుతున్నపుడే నాన్న చనిపోయాడని.. అప్పటి వరకు విషయం తనకు తెలియదని.. ఆ రోజు రాత్రంతా జర్నీ చేసి ఊరెళ్లానని.. కానీ అప్పటికే అన్నీ పూర్తి చేసేశారని చెప్పింది తేజస్విని. ఆయన చనిపోయే వరకు కూడా నాన్న ప్రేమను పొందలేకపోయానని గుర్తు చేసుకుని బాధ పడింది ఈమె. అలా తన జీవితంలో నాన్న ప్రేమను కోల్పోయానంటుంది ఈమె.
అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి అమ్మ తనను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని.. ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి.. ఒక ఆడదాని జీవితంతో ఎందుకు ఆడుకోవాలంటూ కన్నీరు పెట్టుకుంది. ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి.. ఆడదాని జీవితంతో ఆడుకోకండి అంటూ స్టేజీపైనే ఏడ్చేసింది. పక్కనే ఉన్న ఐశ్వర్య అమ్మగారు ఆమెను ఓదార్చారు. మొత్తానికి సీరియల్స్‌తో బాగా దగ్గరైన ఈ అమ్మాయిలకు జీవితంలో ఇన్ని కష్టాలున్నాయా అని తెలుసుకుని అంతా పాపం అనుకుంటున్నారు.