సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ తాజాగా చేసిన మూవీ కార్తికేయ 2. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) హీరోయిన్ గా నటించింది. Karthikeya2. ఈ సినిమాకు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ఫినిష్ అయినా కూడా ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆగష్టు 13న రిలీజ్ చేసారు మేకర్స్. గత శని వారం విడుదలైన ఈ మూవీ మంచి టాక్’తో దూసుకెళ్తుంది. మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న పలు చిత్రాల్లో నిఖిల్ నటించిన కార్తికేయ 2కూడా నిలిచింది. Karthikeya 2 collections Twitter
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ2. కార్తికేయ చిత్రం కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. యూ ఎస్ లో సైతం సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.ఇప్పటికే అక్కడ వన్ మిలియన్ యూఎస్ డాలర్స్ సైతం కలెక్ట్ చేసింది. Karthikeya 2 Twitter Review Photo : Twitter
నార్త్ లో కార్తికేయ 2 కి క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. మొదటి రోజు నుండి భారీగా థియేటర్ల సంఖ్య పెరుగుతుంది.ప్రస్తుతం నార్త్‌లో కార్తికేయ 2 సినిమాకు రోజుకు రోజుకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. దీంతో ఆమీర్ లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ల ‘రక్షా బంధన్’ సినిమాలను తీసేసి కార్తికేయ 2కు స్క్రీన్స్‌ను పెంచుతున్నారు. Karthikeya2 Pre Release Event Twitter
ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడి తత్త్వం గురించి చెప్పే డైలాగులు ఆడియన్స్‌ను గూస్ బంప్ తెప్పించేలా ఉన్నాయి. ఆ ఒక్క సన్నివేశమే ఈ సినిమాను ఎక్కడో కూర్చోబెట్టింది. ముఖ్యంగా శ్రీకృష్ణుడిని మించిన ఫిలాసఫర్, డాక్టర్, సైంటిస్ట్, గైడ్, వ్యవసాయదారుడు, యుద్ధ వీరుడు లేడంటూ చెప్పే డైలాగులు ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యాయి. (Twitter/Photo)
ఇక సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో రోజు ఇండిపెండెన్స్ డే హాలిడే ఓ రేంజ్ లో కలిసి వచ్చి అన్ని సెంటర్స్ లోనూ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునేలా చేయగా ఈ రోజు సాధించిన కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.
కార్తికేయ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 5.05 కోట్లు షేర్ ( రూ. 8.50 కోట్ల గ్రాస్) రాబట్టింది. రెండో రోజు ఈ సినిమా రూ. 5.02 కోట్లు షేర్ (రూ. 8.50 కోట్ల గ్రాస్) మూడో రోజు ఈ సినిమా రూ. 5.37 కోట్లు షేర్ (రూ, 9.50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. నాల్గో రోజు ఈ సినిమా రూ. 3.07 కోట్లు (రూ. 4.30 కోట్లు), ఐదు రోజు రూ. 2.99 కోట్లు (రూ. 5.60 కోట్ల గ్రాస్), ఆరో రోజు.. రూ. 2.16 కోట్లు షేర్ (రూ. 4.25 కోట్లు గ్రాస్),ఏడో రోజు రూ. 4.37 కోట్లు షేర్ (రూ. 8.55 కోట్ల గ్రాస్),ఎనిమిదవ రోజు రూ. 3.83 కోట్ల షేర్ (7.75 కోట్ల గ్రాస్) ఆది వారం 9వ రోజు రూ. 4.52 కోట్ల షేర్ (రూ. 9.65 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది. Karthikey 2 Photo : Twitter
ఏరియా వైజ్ 9 రోజుల కార్తికేయ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 8.64కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ. 3.65 కోట్లు షేర్, ఉత్తరాంధ్ర రూ. 3.20 కోట్లు.. ఈస్ట్ గోదావరి - రూ. 1.87 కోట్లు.. వెస్ట్ గోదావరి - రూ. 1.24 కోట్లు గుంటూరు - రూ. 1.97కోట్లు కృష్ణా - రూ. 1.65 కోట్లు.. నెల్లూరు రూ. 0.71 కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి 9 రోజుల్లో కలిపి రూ. 22.93 కోట్లు షేర్ (రూ. 36.55కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది.కర్ణాటక +రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 1.95 కోట్లు ఓవర్సీస్ రూ. 4.30 కోట్లు, నార్త్ ఇండియా రూ. 7.20 కోట్లు షేర్ ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లో కలిపి 2రూ. 36.38 కోట్ల షేర్ (రూ. 68.00 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. (Twitter/Photo) (Twitter/Photo)
3 వరుస హిట్స్ కేవలం 1 వారం గ్యాప్ లోనే టాలీవుడ్ కి సొంతం అవ్వడం ఇప్పుడు మరింత స్పెషల్ అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకున్న కార్తికేయ 2 ఇప్పుడు…వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తి కరంగా మారింది. మొత్తంగా 9 రోజుల్లో రూ. 23.08 కోట్ల లాభాలతో అసలు సిసలు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)