ఒక్కోసారి కొన్ని అద్భుతాలు జరిగిపోతుంటాయి. అలాంటి అద్బుతమైన కార్తికేయ 2 సినిమా ఒకటి. చినుకు చినుకు గాలి వాన అయినట్టు.. తెలుగులో చిన్న సినిమాగా మొదలైన కార్తికేయ 2 బాక్సాఫీస్ దూకుడు.. నార్త్ ఆడియన్స్‌ను కూడా ఫిదా చేసింది. అక్కడ ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా థియేట్రికల్‌గా ఈ సినిమా ఎన్ని కోట్లు లాభాలను తీసుకొచ్చిందంటే.. (Karthikeya2 Twitter)
సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ ఈ యేడాది చేసిన మూవీ కార్తికేయ 2. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహించినఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ2. కార్తికేయ చిత్రం కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. అటు యూ ఎస్ లో సైతం సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది .ఇప్పటికే అక్కడ వన్ మిలియన్ యూఎస్ డాలర్స్ సైతం కలెక్ట్ చేసింది. Karthikeya 2 Twitter Review Photo : Twitter
నార్త్ లో కార్తికేయ 2 కి క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. మొదటి రోజు నుండి భారీగా థియేటర్ల సంఖ్య పెంచారు. నార్త్‌లో కార్తికేయ 2 సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాకు పోటీగా విడుదలైన ఆమీర్ లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ల ‘రక్షా బంధన్’ సినిమాలను తీసేసి కార్తికేయ 2కు స్క్రీన్స్‌ను పెంచారు. Karthikeya2 Pre Release Event Twitter
ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ శ్రీకృష్ణుడి తత్త్వం గురించి చెప్పే డైలాగులు ఆడియన్స్‌ను గూస్ బంప్ తెప్పించాయి. ఆ ఒక్క సన్నివేశమే ఈ సినిమాను ఎక్కడో కూర్చోబెట్టింది. ముఖ్యంగా శ్రీకృష్ణుడిని మించిన ఫిలాసఫర్, డాక్టర్, సైంటిస్ట్, గైడ్, వ్యవసాయదారుడు, యుద్ధ వీరుడు ఆయనలాంటి వారు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేరంటూ చెప్పే డైలాగులు ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యాయి. (Twitter/Photo)
కార్తికేయ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు రూ. 5.05 కోట్లు షేర్ ( రూ. 8.50 కోట్ల గ్రాస్) రాబట్టింది. రెండో రోజు ఈ సినిమా రూ. 5.02 కోట్లు షేర్ (రూ. 8.50 కోట్ల గ్రాస్) మూడో రోజు ఈ సినిమా రూ. 5.37 కోట్లు షేర్ (రూ, 9.50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. నాల్గో రోజు ఈ సినిమా రూ. 3.07 కోట్లు (రూ. 4.30 కోట్లు), ఐదు రోజు రూ. 2.99 కోట్లు (రూ. 5.60 కోట్ల గ్రాస్), ఆరో రోజు.. రూ. 2.16 కోట్లు షేర్ (రూ. 4.25 కోట్లు గ్రాస్),ఏడో రోజు రూ. 4.37 కోట్లు షేర్ (రూ. 8.55 కోట్ల గ్రాస్),ఎనిమిదవ రోజు రూ. 3.83 కోట్ల షేర్ (7.75 కోట్ల గ్రాస్) ఆది వారం 9వ రోజు రూ. 4.52 కోట్ల షేర్ రూ. 9.65 కోట్ల గ్రాస్), పదో రోజు రూ. 2.35 కోట్లు షేర్ (రూ. 5.20 కోట్లు గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది. Karthikey 2 Photo : Twitter
ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 క్లోజింగ్ థియేట్రికల్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 13.30కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ. 5.02 కోట్లు షేర్, ఉత్తరాంధ్ర రూ. 4.53 కోట్లు.. ఈస్ట్ గోదావరి - రూ. 1.68కోట్లు.. వెస్ట్ గోదావరి - రూ. 1.68 కోట్లు గుంటూరు - రూ. 2.80కోట్లు కృష్ణా - రూ. 2.29 కోట్లు.. నెల్లూరు రూ. 1.12 కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి ఈ చిత్రం రూ. 33.35 కోట్లు షేర్ (రూ. 56.05కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది.కర్ణాటక +రెస్టాఫ్ భారత్ కలిపి రూ. 2.95 కోట్లు ఓవర్సీస్ రూ. 6.55 కోట్లు, నార్త్ ఇండియా రూ. 15.55 కోట్లు షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2రూ. 58.40 కోట్ల షేర్ (రూ. 121.50 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. (Twitter/Photo)
మూడు రోజుల్లో టార్గెట్ ని కంప్లీట్ చేసుకుని లాభాల లోకి ఎంటర్ అయిన కార్తికేయ 2 సినిమా టాలీవుడ్ తరుపున ఈ ఇయర్ క్లీన్ హిట్ అయిన…11 వ సినిమాగా నిలిచింది… ఈ లిస్టులో 4 డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నప్పటికీ మొత్తం మీద స్ట్రైయిట్ తెలుగు సినిమాలు 7 ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.80 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 13.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ చిత్రం మొత్తంగా రూ.45.10 కోట్లు లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా పెట్టిన పెట్టుబడికి నాలుగింతల లాభం తీసుకొచ్చింది. (Twitter/Photo)