యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కలెక్షన్ల విషయంలో కార్తికేయ 2 దుమ్ము లేపుతోంది. రూ.100 కోట్ల వసూళ్లు నమోదు చేసిన కార్తికేయ 2 సినిమా బాలీవుడ్ లో కూడా భారీగా కలెక్షన్లు దక్కించుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. Karthikeya2 Twitter)
కార్తికేయ 2 థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది. దసరా కానుకగా కార్తికేయ 2 ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మైథలాజికల్ యాక్షన్ అడ్వంచర్ మూవీగా రూపొందిన కార్తికేయ- 2 .. నవంబర్ 20న ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారమైంది. (Karthikeya 2 collections Twitter)
తాజాగా ఈ సినిమా మొదటిసారి ప్రసారమైనపుడు మంచి రేటింగ్ దక్కించుకుంది. ఈ సినిమా అర్బన్ + రూరల్ = 6.75.. అర్బన్‌లో 7.88 రేటింగ్ దక్కించుకుంది. ఒక రకంగా ఇది తక్కువ రేటింగ్ అని చెప్పాలి. ఈ సినిమాకు తక్కువ రేటింగ్ వెనక పెద్ద రీజనే ఉంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఓటీటీ వేదికగా చూసేస్తున్నారు. ఓటీటీలో తమకు నచ్చిన టైమ్‌లో చూసుకోవచ్చు. ఈ సినిమాను చాాలా మంది థియేటర్స్‌తో పాటు ఓటీటీలో చూడటంతో ఈ సినిమాకు తక్కువ రేటింగ్ వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ రేటింగ్స్ మరింత తగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.