సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ తాజాగా చేసిన మూవీ కార్తికేయ 2. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) హీరోయిన్ గా నటించింది. Karthikeya2
నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ఫినిష్ అయినా కూడా ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఆగష్టు 13న రిలీజ్ చేసారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ మూవీ మంచి టాక్’తో దూసుకెళ్తుంది. మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న పలు చిత్రాల్లో నిఖిల్ నటించిన కార్తికేయ 2కూడా నిలిచింది. Karthikeya 2 collections Twitter
నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం కార్తికేయ2. కార్తికేయ చిత్రం కి సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. యూ ఎస్ లో సైతం సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుందిKarthikeya 2 Twitter Review Photo : Twitter
నార్త్ లో కార్తికేయ 2 కి క్రేజ్ రోజురోజుకీ పెరుగుతోంది. మొదటి రోజు నుండి భారీగా థియేటర్ల సంఖ్య పెరుగుతుంది.మూడో రోజు ఈ చిత్రానికి అక్కడ భారీ వసూళ్లు వచ్చాయి. అయితే నేటి నుండి మరింత గా ఈ దియేటర్ల సంఖ్య పెరగనుంది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం మరిన్ని అద్భుతాలు క్రియేట్ చేసే అవకాశం ఉంది. Karthikeya2 Pre Release Event Twitter
తాజాగా కార్తికేయ 2 డైరెక్టర్‌ను బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కలిశారు. ఈ రోజు, చందూ మొండేటి తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది.ధన్యవాదాలు అమితాబ్ బచ్చన్ జీ, లైఫ్ టైమ్ మెమరీస్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (Instagram photo)
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6వ రోజు తెలుగు రాష్ట్రాలలో 1.3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా సినిమా 1.34 కోట్ల రేంజ్ లో షేర్ ని…సొంతం చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 2.16 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ని చూపిస్తూ దూసుకు పోతుంది.
ఇక కార్తికేయ, బింబిసార,సీతారామం ఇలా మూడు వరుస హిట్స్ కేవలం 1 వారం గ్యాప్ లోనే టాలీవుడ్ కి సొంతం అవ్వడం ఇప్పుడు మరింత స్పెషల్ అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకున్న కార్తికేయ 2 ఇప్పుడు…వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తి కరంగా మారింది.