shoba shetty: బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ తో మోనితగా పరిచయమైన నటి శోభా శెట్టి. కన్నడ కు చెందిన ఈ బ్యూటీ బుల్లితెరలో పలు సీరియల్ లో నటించగా.. అసలు గుర్తింపు మాత్రం కార్తీక దీపం సీరియల్ లో నెగటివ్ పాత్రతో తెచ్చుకుంది. కన్నడలో ఓ సినిమాలో కూడా నటించింది శోభా శెట్టి. ప్రస్తుతం కన్నడ సీరియల్స్ లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ అమ్మడు తెలుగు సీరియల్స్ లో విలన్ పాత్ర చేస్తూ మెప్పిస్తుంది. అలాంటి ఈ భామ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను బాగా పంచుకుంటుంది. ఈమధ్య యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసుకోగా తన సీరియల్ కు సంబంధించిన విషయాలు కూడా పంచుకుంటుంది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయ్.