KARTHIKA DEEPAM VANTALAKKA FAME PREMI VISWANATH TO ACT IN TOLLYWOOD CRAZY PROJECT HERE ARE THE DETAILS TA
Premi Viswanath - Vantalakka: కార్తీక దీపం వంటలక్కకు మరో బంపరాఫర్.. స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ప్రేమి విశ్వనాథ్..
Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క దీప గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె కార్తీక దీపం రేటింగ్ ముందు మిగతా సీరియల్స్ అన్ని దిగదుడుపే. తాజాగా ఈమె ఓ టాలీవుడ్ సినిమాలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
కార్తీక దీపం వంటలక్క దీప గురించి తెలుగు టీవీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఆమె కార్తీక దీపం రేటింగ్ ముందు మిగతా సీరియల్స్ అన్ని దిగదుడుపే. . premi viswanath instagram
2/ 12
గత రెండేళ్లుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్‌లో కొనసాగుతూనే ఉంది. కార్తీక దీపం దూకుడు ఆపే సీరియల్ ఎపుడు వస్తుందో కానీ.. ఇప్పటికైతే.. కార్తీక దీపం సీరియల్ తెలుగులో నెంబర్ వన్ పొజిషన్లోనే కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో రేటింగ్ విషయంలో కాస్త వెనకబడింది. . premi_vishwanath Instagram
3/ 12
ఆ సంగతి పక్కన పెడితే.. కార్తీక దీపం సీరియల్‌తో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్లో పెరిగింది. premi_vishwanath Instagram
4/ 12
ఈ సీరియల్లో వంటలక్క అలియాస్ దీప.. హీరోయిన్స్ మించి పాపులారిటీ సంపాదించుకుంది. ఓ సీరియల్‌తో ఇంత అభిమానం పొందిన నటి ఎవరైనా ఉన్నారంటే.. అంది వంటలక్కే. ఈమె క్రేజ్‌ను బడా హీరోలను సైతం విస్తుపోయేలా చేస్తోంది. premi_vishwanath Instagram
5/ 12
అందరికీ ఈమె వంటలక్కగానే పరిచయం కాబట్టి. కార్తీక దీపం సీరియల్‌తో తెలుగులో కూడా చాలా గుర్తింపు సంపాదించుకుంది దీప ఉరఫ్ ప్రేమీ విశ్వనాథ్. పండగల సందర్భంలో టీవీ ఛానెల్స్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో ఈమెను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. Photo : Instagram
టీవీ సీరియల్‌తో వచ్చిన గుర్తింపుతో ఈమెకు వెండితెరపై అవకాశాలు కూడా వస్తున్నాయి. Photo : Instagram
8/ 12
కానీ ప్రేమి విశ్వనాథ్ మాత్రం ఏ సినిమాకు ఓకే చెప్పలేదు. కానీ తాజాగా ఓ తెలుగు సినిమాకు ప్రేమి విశ్వనాథ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. premi_vishwanath Instagram Photo : Instagram
9/ 12
రామ్ పోతినేని, కృతి శెట్టి హీరో, హీరోయిన్లుగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో వంటలక్క కీ రోల్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. Photo : Instagram
10/ 12
ఇప్పటికే ప్రేమి విశ్వనాథ్ ఇంటికి వెళ్లి లింగు స్వామి సినిమా కథతో పాటు అందులో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో వివరించి చెప్పాడట. Photo : Instagram
11/ 12
త్వరలో వంటలక్క అదేనండి ప్రేమి విశ్వనాథ్ టాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన అపీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. Photo : Instagram
12/ 12
మొత్తంగా స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను అలరించిన ప్రేమి విశ్వనాథ్ అదేనండి వంటలక్క సిల్వర్ స్క్రీన్ పై ఏ రేంజ్లో అలరిస్తుందో చూడాలి. Photo : Instagram