Premi Vishwanath: వంటలక్కకు నిజజీవితంలో వంట చెయ్యడం వచ్చా.. సెట్స్‌లో అలా ఉంటుందా?
Premi Vishwanath: వంటలక్కకు నిజజీవితంలో వంట చెయ్యడం వచ్చా.. సెట్స్‌లో అలా ఉంటుందా?
Premi Vishwanath: తెలుగు టీవీ సీరియల్ చరిత్రలో కార్తీక దీపం సీరియల్‌తో ఆలిండియా లెవెల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... ఇక ఈమె ప్రస్తుతం సోషల్ మీడియాలో కుడా ఫుల్ యాక్టివ్ ఉంటుంది.
Premi Vishwanath: తెలుగు టీవీ సీరియల్ చరిత్రలో కార్తీక దీపం సీరియల్‌తో ఆలిండియా లెవెల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు... ఇక ఈమె ప్రస్తుతం సోషల్ మీడియాలో కుడా ఫుల్ యాక్టివ్ ఉంటుంది.
2/ 10
ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్, ఫాలోయర్లతో పంచుకుంటోంది. ఆమె నుంచీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా చాలు... మహిళలు, పురుషులు అని తేడా లేకుండా అందరూ ఎంతో ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.
3/ 10
ఇప్పటికే టీఆర్పీ రేటింగ్స్‌లో తొలిస్థానంలో కార్తీక దీపం సీరియల్ కొనసాగుతున్న సంతోషంలో ఉన్న ప్రేమీ విశ్వనాథ్... క్రమంగా సినీ తారల్ని మించి... ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
4/ 10
ఒకప్పుడు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె... ఇప్పుడు రెగ్యులర్‌గా తన అప్డేట్స్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇటీవలే తన పుట్టిన రోజు వేడుకల విశేషాల్ని కూడా అందరితో పంచుకుంది.
5/ 10
అటు మలయాళ ప్రేక్షకులు, ఇటు తెలుగు ప్రేక్షకులూ అందరూ వంటలక్కను తమ ఇంట్లో సొంత అక్కలా ఫీలవుతున్నారు. దానికి తోడు... కార్తీక దీపం సీరియల్లో ఆమె పాత్ర కూడా ఎంతో సెంటిమెంట్‌తో కూడుకున్నది కావడంతో... తెలుగు ప్రజలు ఆమెకు బాగా కనెక్ట్ అయిపోయారు.
6/ 10
అందువల్ల ఇప్పుడు ప్రేమీ విశ్వనాథ్... ఏం చేసినా అదో సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోతోంది. అయితే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ రియల్ లైఫ్ గురించి ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం..
7/ 10
వంటలక్క సీరియల్లో వంటలు చేస్తూ క్యారేజీలు అందిస్తూ స్వయం ఉపాధికి స్ఫూర్తిగా నిలిచినా వంటలక్క నిజజీవితంలో వంటలు చేస్తుందా అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా.. వచ్చి ఉండకపోవచ్చు.. కానీ వంటలక్కకు నిజజీవితంలో వంట చెయ్యడం పెద్దగా రాదట.
8/ 10
కానీ సెట్ లో మాత్రం నాన్ వెజ్ లేనిదే దీపకు ముద్ద దిగదు అని డాక్టర్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అంతేకాదు సెట్ లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
9/ 10
ఇక ఈ మలయాళీ బ్యూటీ నిజ జీవితంలో భర్త పేరు టియస్ వినీత్ భట్ ఆయన ప్రపంచంలో అత్యుత్తమ జ్యోతిష్యుడు కావడం విశేషం. బెస్ట్ ఆస్ట్రాలేజర్ ఆఫ్ ది వరల్డ్ అనే అవార్డు అందుకున్నారు. ఆయన క్లయింట్స్ దేశంలోని ప్రముఖ రాజకీయ, సినిమా ప్రముఖులు ఉండటం విశేషం.
10/ 10
ఇది వంటలక్క నిజ జీవితం.. అటు మలయాళం సీరియల్ లోను ఇటు తెలుగు సీరియల్ లోను నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది వంటలక్క. ప్రస్తుతం సినిమా అవకాశాలతో బిజీ బిజీగా గడిపేస్తుంది ప్రేమి విశ్వనాథ్.