Nirupam Paritala: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ తో డాక్టర్ బాబుగా ఎంతోమంది హృదయాలను దోచుకున్నాడు నిరూపమ్ పరిటాల. ఎన్నో సీరియల్స్ లో నటించగా.. కార్తీకదీపంతో మాత్రమే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతేకాకుండా మరో సీరియల్లో కూడా నటిస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా టచ్ లో ఉంటూ తెగ పోస్ట్ లు చేస్తాడు. ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక అందులో అమ్మ పాత్రల్లో నటిస్తున్న సౌందర్యతో ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పంచుకోగా.. అడక్కుండానే డాక్టర్ ను చేశావ్.. పిలవకుండానే స్టేషన్ కు వచ్చావ్..అయినా నువ్వు నాకు నచ్చావ్..అంటూ నిలదీసినట్లు ఫన్నీగా క్యాప్షన్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.