Karthika Deepam - Premi Viswanath: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని కోట్లమంది మనసు దోచిన సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లో నటించిన ప్రేమి విశ్వనాథ్ అలియాస్ వంటలక్క అభిమానులు గురించి చెప్పడానికి లేదు. అలాంటి వంటలక్క సీరియల్ టాప్ టీఆర్పీతో దూసుకుపోతుంది.. ప్రస్తుతం ఉత్కంఠంగా మారిన ఈ సీరియల్ కు త్వరలోనే శుభం కార్డు పడుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే వంటలక్క తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయ్. ఆ ఫొటోస్ లో వంటలక్క ఎంతో స్టైలిష్ ఉంది.. వంటలక్క జీన్స్ ధరించి ఎంతో స్టైలిష్ గా దర్శనం ఇచ్చింది. ఈ ఫోటో చూసిన అభిమానులు కార్తీకదీపం సీరియల్ అయిపోతుందా అక్క అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి వంటలక్క కొత్త లుక్ వెనుక రహస్యం ఏంటో తెలియాల్సి ఉంది.