Karthika Deepam : కార్తీక దీపం సీరియల్లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటిస్తోన్న భామ కన్నడ నటి శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.. Photo : Instagram
కార్తీకదీపం విషయానికి వస్తే.. సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కరలేదు. ఆ సీరియల్ దెబ్బకు బిగ్ బాస్ లాంటీ షోలు సైతం కుదేలు అయ్యాయి. ఇంకా చెప్పాలంటే స్టార్ మాకు ఈ సీరియలే పెద్ద దిక్కు. స్టార్ మాకు కొన్నాళ్లపాటు టాప్ రేటింగ్ ఇచ్చింది ఈ సీరియల్. అయితే ఈ మధ్య మరింత సాగ దీత కారణంగా ఇక సీరియల్‌ను ముగించింది టీమ్. Photo : Instagram.
కార్తీక దీపం విషయానికి వస్తే.. ఈ సీరియల్ ఏళ్లతరబడి టెలివిజన్ తెరను ఏలిందనే చెప్పాలి. మొదట కొన్ని వందల ఎపిసోడ్స్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. ఇక ఆ తర్వాత సీరియల్ కాస్తా చిరాకు పుట్టించిందని కామెంట్స్ వినిపించాయి. ఏది ఏమైనా ఒకానొక సమయంలో దేశంలోనే నంబర్ వన్ సీరియల్‌గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. Photo : Instagram
ఇక ప్రేమి విశ్వనాథ్(Premi Viswanath) విషయానికి వస్తే.. ఈ పేరు తెలుగు బుల్లితెరపై ఉన్న క్రేజ్ వేరు. కార్తీక దీపంలో తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని కట్టిపడేసిన ఈ నటి స్టార్ హీరోయిన్లకు పోటీగా ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. చేస్తున్నది ఒకే ఒక్క సీరియల్ అయినప్పటికీ.. మిగిలిన ఏ సీరియల్ నటీనటులు ఆమెను బీట్ చేయలేకపోతున్నారు. . Photo : Instagram
Karthika Deepam : ఈమె గురించి చాలా మందికి ఎక్కువుగా తెలియదు.. అర్చన ప్రస్తుతం కార్తీక దీపంతో పాటు స్టార్ మా మరో సీరియల్ ‘కేరాఫ్ అనసూయ’లో కూడా నటించింది. ఇందులో కూడా పవర్ఫుల్ పాత్ర పోషించింది అర్చన అనంత్. అందాల అత్త అర్చన ఫ్యాషన్ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడిందట మొదట. అయితే ఆ తర్వాత కలిసిరాక నటి అయి ఇప్పుడు విశ్వరూపం చూపుతోంది
Karthika Deepam : ఈమె గురించి చాలా మందికి ఎక్కువుగా తెలియదు.. అర్చన ప్రస్తుతం కార్తీక దీపంతో పాటు స్టార్ మా మరో సీరియల్ ‘కేరాఫ్ అనసూయ’లో కూడా నటించింది. ఇందులో కూడా పవర్ఫుల్ పాత్ర పోషించింది అర్చన అనంత్. అందాల అత్త అర్చన ఫ్యాషన్ డిజైనర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాటపడిందట మొదట. అయితే ఆ తర్వాత కలిసిరాక నటి అయి ఇప్పుడు విశ్వరూపం చూపుతోంది
అర్చన ఓ మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని ‘‘ఫ్యాషన్ డిజైనర్‌గా చేస్తున్నవేళ, తన సహచరులు ఓ కన్నడ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వమని కోరగా.. సరే, అడిగారు కదా అని వెళ్లి ఆడిషన్లో పాల్గొన్నాను. దీంతో నటించే అవకాశం వచ్చింది. అయితే నా తొలి పాత్ర ఓ శవంలా పడుకోవడం. అలా నా నటనా ప్రయాణం ప్రారంభమైంది’’ అని చెప్పుకొచ్చారు. Photo : Instagram
అర్చన నాన్న కన్నడ సినిమాలో పేరున్న నటుడు అనంత వేలు. నటిగా మారిన పదేళ్లకు కానీ తెలుగులో తనకు అవకాశం లభించలేదన్నారు అర్చన. కార్తీకదీపంలో సౌందర్య క్యారెక్టర్ కోసమే తనకు ఇన్నేళ్లూ అవకాశం లభించలేదేమోనని అప్పుడప్పుడూ అనిపిస్తుందంటూ కార్తీకదీపంలో ఆ పాత్ర లభించడం తన లక్ అని పేర్కోన్నారు. తన సినిమా రంగ ప్రవేశం గురించి మాట్లాడుతూ.. కన్నడలో ఇప్పటికే మూడు చిత్రాలు చేశానని.. కానీ తెలుగులో ఓ మంచి క్యారెక్టర్‌తో ఎంట్రీ ఇవ్వాలనీ కోరుకుంటున్నాను. Photo : Instagram
అదీ ఓ పవర్ఫుల్ పోలీసాఫీర్‌గా కనిపించాలనుకుంటున్నాను. అలాగే ‘దాసీ’ క్యారెక్టర్లో కూడా నటించాలని ఉందన్న అర్చన.. మంచి అవకాశం వస్తే ఓటీటీలలో కూడా నటిస్తానని పేర్కోంది. ఇక్కడ విషయం ఏమంటే.. అర్చనకు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఓ రెండు సినిమాల్లో అర్చన కీలకపాత్రల్లో నటిస్తుందని సమాచారం. Photo : Instagram