Premi Viswanath: కార్తీక దీపం.. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ కు ఉన్న అభిమానులు ఏ సీరియల్ కి ఉండరు. ఇక ఇందులో వంటలక్కకు భారీ ఫాలోయింగ్ ఉంది.
2/ 10
ఇక ఆ ఫాలోయింగ్ ని పెంచుకుంటూ.. రోజు రోజుకు అభిమానులను భారీస్థాయిలో పెంచుకుంటుంది ఈ వంటలక్క.
3/ 10
ఇక ఈ నేపథ్యంలోనే వంటలక్క ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
4/ 10
నిజానికి ఆ వీడియోలో వంటలక్క నిర్మాతతో సరదాగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అన్నప్పటికీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
5/ 10
అసలు విషయం ఏమిటంటే... వంటలక్కకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది..
6/ 10
ఆ ఛానెల్ లో వంటలక్క, కార్తీకదీపం సీరియల్ నిర్మాతతో మాట్లాడుతూ.. కేరళలో మా పార్టీ బంపర్ విక్టరీ కొట్టిందని చెప్పింది..
7/ 10
దీంతో నీకు అక్కడ నెక్స్ట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అని అడిగాడు నిర్మాత. ''ఎమ్మెల్యేనా.. నాకు పాలిటిక్స్ ఇంట్రస్ట్ లేదు సార్'' అంటూ చెప్పుకొచ్చింది వంటలక్క.
8/ 10
పోని కేరళ సంగతి వదిలెయ్.. ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తావా? అని నిర్మాత అడగడంతో ''హా టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా'' అంటూ సరదాగా చెప్పిన వంటలక్కను
9/ 10
ఏ పార్టీలో చేరుతావు అంటే.. అది చేరినప్పుడు చెప్తా అంటూ సమాధానం ఇచ్చింది వంటలక్క.
10/ 10
ప్రస్తుతం ప్రేమి విశ్వనాథ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.