Karthika Deepam: స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి.. బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఇక ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పలేము.
Karthika Deepam: స్టార్ మా లో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి.. బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఇక ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో చెప్పలేము.
2/ 8
ఎందుకంటే ఎంతపని ఉన్నా ఈ సీరియల్ వచ్చే సమయానికి టీవీల ముందు వాలిపోతారు. అలాంటి ఈ సీరియల్ రేటింగ్ విషయంలో కూడా ముందుంది. అంతేకాకుండా ఈ సీరియల్ ప్రభావం సోషల్ మీడియా పై కూడా పడిందనే చెప్పవచ్చు.
3/ 8
ఇక ఇందులో నటించే నటీనటుల గురించి అందరికీ తెలిసిందే. ప్రధాన పాత్రల్లో దీప, కార్తీక్ ల పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా వీళ్ళ కూతురుగా సౌర్య, హిమల పాత్రలు కూడా ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు.
4/ 8
ఇక ఈ సీరియల్లో దీప, కార్తీక్ తాము పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని మనస్పర్థల వల్ల జరిగిన గొడవ వల్ల దూరం అవ్వగా.. ఇక అప్పటి నుంచి వారిద్దరూ ఎప్పుడు కలుస్తారా అని ప్రేక్షకులు ఎదురు చూడని రోజులే లేవు.
5/ 8
అంతేకాకుండా హిమ, సౌర్య లు కూడా తమ తల్లిదండ్రుల విషయంలో ఆలోచించే విధానం, వారిని ఎలాగైనా పట్టుకోవాలనే పట్టుదల మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పటి వరకు ఈ సీరియల్ సాగుతూనే ఉండగా.. తాజాగా కాస్త కొత్తదనంతో ఆసక్తిగా మారింది.
6/ 8
ఇక ఇందులో నటించే పిల్లల పాత్రలు మాత్రం.. తమ మాటలతో చిచ్చర పిడుగులు గా ఉంటారు. అంతేకాకుండా వీరి నటన, ఆలోచన ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఇదిలా ఉంటే వీళ్ళ పాత్రలు ప్రేక్షకులను ఎంత దగ్గరగా చేశాయో అర్థమవుతుంది.
7/ 8
ఇక ఈ చిచ్చర పిడుగులు తమ కాస్ట్యూమ్ విషయంలో వెనుకాడకుండా నటిస్తుంటారు. ఇందులో హిమ చూడడానికి నలుపు రంగులో ఉండగా.. ఈ పాత్ర కోసం కాదనకుండా నటిస్తోంది. ఇదిలా ఉంటే వీరిద్దరి పారితోషకం కూడా ఎక్కువగానే ఉంది.
8/ 8
వీరిద్దరు కేవలం ఒక్క రోజుకే రూ.7 వేలు అందుకుంటారట. అందుకే వీరి పాత్రలు కూడా అదే రేంజ్లో ఉంటాయి. ప్రస్తుతం వీరి రెమ్యూనరేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.