తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని కదిలించినా వంటలక్క, డాక్టర్ బాబు అంటే ఈజీగా చెప్పేస్తారు. తెలుగు బుల్లితెరపై ఈ క్యారెక్టర్స్ తో వచ్చిన 'కార్తీక దీపం' సీరియల్ ప్రేక్షకులకి బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ రేటింగ్స్‌లో ఇండియాలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఇక ఇందులో నటించిన క్యారెక్టర్లకు కూడా అదే స్థాయిలో పేరు వచ్చింది.Photo Twitter
ఇక ఈ సీరియల్ లో వంటలక్క పాత్రలో నటించిన కేరళ నటి ప్రేమి విశ్వనాథ్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. డాక్టర్ బాబు క్యారెక్టర్ చేసిన నిరుపమ్‌కి కూడా ఈ సీరియల్‌తో అభిమానులు పెరిగారు. ఇక ఇప్పుడు నాగచైతన్య సినిమాలో ప్రేమి విశ్వనాథ్ నటిస్తుందని తెలియడంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.