Karthika deepam - Umadevi: స్టార్ మా లో స్టార్ మా పరివార్ చాంపియన్షిప్ షో ప్రసారమైన సంగతి తెలిసిందే. ఇక ఇందులో స్టార్ మా సీరియల్స్ నటులతో పాటు మరికొంత మంది సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఇక డాన్స్ లతో, పాటలతో బాగా రచ్చ చేశారు. ఇక సుమ, శ్రీముఖి తమ యాంకరింగ్ తో బాగా సందడి చేశారు. ఇదిలా ఉంటే ఇందులో ప్రతి ఒక్క సీరియల్ టీమ్ లతో గేమ్ ఆడించగా.. కార్తీకదీపం, కేరాఫ్ అనసూయ, నీవల్లే నీవల్లే సీరియల్ టీమ్ లు పాల్గొన్నారు. ఇక సుమ వాళ్లను కొన్ని ప్రశ్నలు ప్రశ్నించగా.. కార్తీకదీపం టీమ్ బాగా ఆడింది. పైగా భాగ్యం ప్రశ్నలన్నింటికీ టకటక సమాధానాలిచ్చింది. మొత్తానికి తన టీమ్ ను గెలిపించింది భాగ్యం. అంతేకాకుండా అన్ని సీరియల్స్ తో పాటు పోటీగా మొదటి స్థానాన్ని కార్తీకదీపం సీరియల్ అందుకుంది.