బుల్లితెరపై ఎన్నో ప్రోగ్రామ్లు వస్తున్నా కూడా అవేవి స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతోన్న కార్తీకదీపం సీరియల్కు ఓ మూలకు కూడా రావడం లేదు. అంతగా ఈ సీరియల్ కు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విశేషమైన ప్రేక్షకాభిమానులు ఉన్నారు. ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్.. ఎన్నెన్నో ప్రోగ్రామ్లు ఉన్నా కూడా అవేవి కార్తీకదీపం దరిదాపులకు కూడా రావడం లేదు.
కార్తీకదీపం అంటే పేరు కాదు.. అది ఒక బ్రాండ్ లా అయిపోయింది. అంతలా టీవీలకు అతుక్కుపోతుంటారు ఇంట్లోని మహిళలు. అంతలా ఆకట్టుకుంది కార్తీకదీపం సీరియల్. ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల ఈ ధారావాహికలో ప్రధాన పాత్రధారులుగా ఉన్న విషయం తెలిసిందే. దీప(వంటలక్క)గా పరేమి విశ్వనాథ్, కార్తిక్ (డాక్టర్ బాబు)గా నిరుపమ్ పరిటాల పాత్రలను పోషిస్తున్నారు.
వీళ్లిద్దరి క్యారెక్టర్లు ఎంత పాపులర్ అయ్యాయంటే.. బయట సినిమాల్లో కూడా వీళ్ల పాత్రల పేర్లను పెట్టుకుంటున్నారు. అంత క్రేజ్ తెచ్చుకుంది .. ఈ కార్తీక దీపం సీరియల్. ఈ సీరియన్ ప్రారంభమైనప్పటి నుండి రేటింగ్స్ చార్టులో స్థిరంగా అగ్రస్థానంలో ఉంది. ఈ సీరియల్ మలయాళంలో ప్రసారం అవుతున్న కరుతముతూ సీరియల్ ఆధారంగా నిర్మించబడింది.