కార్తీక దీపం సీరియల్ లో దీప తరువాత అంతటి క్రేజ్ ను దక్కించుకున్న ఘనత మోనితకే దక్కిందనే చెప్పాలి. ఈమె అసలు పేరు శోభా శెట్టి అయినా, కార్తీక దీపం సీరియల్ తో ఈమెను అందరూ మోనిత గానే గుర్తిస్తున్నారు. ఇందులో ఈమె పేరుకి నెగటివ్ రోల్ అయినప్పటికీ తన అందమైన నటనతో, డ్రెస్సింగ్ స్టైల్ తో ఫుల్ క్రేజ్ పెంచుకుంది. ( Photo: Instagram)
లేటెస్ట్ గా కార్తీక దీపం వంటలక్క హోం టూర్ వీడియో ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియో తో పాటు మంత్రాలయం టూర్, మోనిత హోం టూర్ వీడియోలు ఫ్యాన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయ్. సినిమా సెలబ్రిటీల వీడియోలు కూడా ఇంత రేంజ్ లో వ్యూస్ దక్కించుకోలేదు. కానీ, మోనిత అలియాస్ శోభా శెట్టి దూకుడు మాములుగా లేదు. ఈ దూకుడు కంటిన్యూ చేస్తే రికార్డులు బ్రేక్ చేయడం గ్యారెంటీ. ( Photo: Instagram)