Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాలుగా స్టార్ మాలో ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. అందుకు కారణం.. ఈ సీరియల్ లోని పాత్రలు.. ఆ పాత్రలు చేసే ఆర్టిస్ట్ లే. ఇక పోతే ఈ సీరియల్ ఆర్టిస్ట్ లు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు.. ముఖ్యంగా డాక్టర్ బాబు. కార్తీక దీపంపై వచ్చే మిమ్స్ చూసి తెగ సంబరపడిపోతుంటాడు డాక్టర్ బాబు.. ఇక ఇప్పుడు అలానే.. డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల ఓ ఫోటో షేర్ చేసి ఓ క్యాప్షన్ కూడా పెట్టాడు. అందులో ఏముందంటే.. ''ఆదివారం షూటింగ్ అని కోపంగా ఉన్నాను.. వంటలక్క మాత్రం అందరి ఫోటోలు తీస్తూ ఫొటోలక్కగా మారుతుంది'' అంటూ నిరుపమ్ కౌంటర్ వేశాడు.. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.