Karthika Deepam: కార్తీకదీపం సీరియల్ ప్రస్తుతం అభిమానులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూస్తూనే ఉన్నాం. ఎట్టకేలకే దీప, కార్తీక్ లు కలిసిపోయే సమయం ఆసన్నం అవ్వడంతో సీరియల్ మరింత ఆసక్తిగా మారింది. ఇక దీప.. కార్తీక్ తో కలిసి సంతోషంగా గడుపుతున్న సమయంలోనే మూన్నాళ్ళ ముచ్చట తీరక ముందే మోనిత ప్రెగ్నెంట్ అని ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. నిజానికి తన ప్రమేయం లేకుండా జరిగిందని కార్తీక్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఉన్నారు కుటుంబ సభ్యులు. కానీ ఇదంతా మోనిత ప్లాన్ చేసిందని నెటిజనులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కార్తీక్ (నిరూపమ్ పరిటాల) సోషల్ మీడియా వేదికగా ఓ పోల్ నిర్వహించాడు. కార్తీక్ అమాయకుడా? లేక నిజంగా తప్పు చేశాడా అని ప్రశ్నించగా దాదాపు 75 శాతం అమాయకుడని ఓటు వేశారు. దీంతో కార్తీక్ వ్యక్తిత్వం గురించి ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉందని ఈ పోల్ తో తెలుస్తుంది.