ఇక మరోవైపు సీరియళ్ల పరంగా కార్తీకదీపం ఫేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కుటుంబం మొత్తం కలిసి కార్తీకదీపం సీరియల్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కుటుంబ విలువలు, ఎమోషన్స్ అన్నీ కలగలుపుతూ ఈ సీరియల్ సూపర్ సక్సెస్ సాధించింది. అయితే ఈ సీరియల్ లో నటించిన చిచ్చర పిడుగులు హిమ (సహృద), శౌర్య (బేబి క్రితిక) ఇప్పుడు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది.
ఇలా కార్తీకదీపం సిస్టర్స్‌కి జబర్దస్త్‌లో గ్రాండ్ ఎంట్రీ లభించిందనే చెప్పుకోవాలి. కాకపోతే ఈ ఒక్క ఎపిసోడ్ కోసం మాత్రమే ఈ కార్తీకదీపం చిచ్చరపిడుగులకు దింపారా? లేదంటే ఇలాగే వీళ్ళను కంటిన్యూ చేస్తారా అనేది మాత్రం ఇప్పటికైతే సస్పెన్స్. ఒకవేళ కంటిన్యూ అయితే మాత్రం జబర్దస్త్ కి మంచి వెయిటేజ్ లభిస్తుందని చెప్పుకోవచ్చు.