Manjula Paritala: కార్తీక దీపం సీరియల్ తెలుగు సీరియల్స్ లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఇంట్లో కార్తీక దీపం సీరియల్ కు ఫ్యాన్స్ ఉన్నారు.. ఎవరు మాట్లాడిన.. వంటలక్కే నెంబర్ 1 అంటారు. కానీ డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల భార్య మంజుల మాత్రం కార్తీక దీపం సీరియలా.. హిట్లర్ గారి పెళ్ళామా అంటే హిట్లర్ గారి పెళ్ళామే బెటర్ అని సమాధానం ఇచ్చి అందరికి షాక్ ఇచ్చింది.. అంతటితో ఆగకుండా.. డాక్టర్ బాబునా.. హిట్లరా అంటే మళ్లీ కూడా హిట్లర్ పాత్రే సూపర్.. డాక్టర్ బాబు ఎప్పుడు కన్ఫ్యూషన్ లో ఉంటాడు.. హిట్లర్ కరెక్ట్ నిర్ణయాలు తీసుకోని హిట్లర్ గా ఉంటాడు అంటూ సమాధానం ఇచ్చింది నిరుపమ్ పరిటాల భార్య మంజుల. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. మరి ఈ కామెంట్స్ పై డాక్టర్ బాబు ఎలా స్పందిస్తాడో చూడాలి.