[caption id="attachment_903676" align="alignleft" width="1200"] Manjula Paritala: కార్తీక దీపం సీరియల్ హీరో డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సీరియల్ స్టార్ నటులలో నెంబర్ 1 ఈ డాక్టర్ బాబే. ఇక అతని భార్య మంజుల పరిటాల కూడా సీరియల్ నటినే. ప్రస్తుతం సీరియల్స్ కు దూరంగా ఉన్న ఈ మంజుల.. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. అలానే నిన్న అస్క్ మీ ఎనీథింగ్ సెక్షన్ లో పాల్గొంది. ఏదైనా అడగండి చెప్తా అన్న మంజులని ఓ నెటిజెన్ ఫోన్ నెంబర్ అడిగాడు అంతే.. వెంటనే ఆమె నెంబర్ ఇచ్చేసింది. అయితే ఫోన్ నెంబర్ కాదు.. 1 నుంచి 10 వరకు ఉన్న అంకెలను తిప్పి 9876543210గా ఫోన్ నెంబర్ గా ఇచ్చింది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.