Karthika Deepam Soundarya: ‘కార్తీక దీపం’ ఫేమ్ సౌందర్యకు షాక్.. ఆ సీరియల్ నుంచి తప్పుకున్న అర్చన..?
Karthika Deepam Soundarya: ‘కార్తీక దీపం’ ఫేమ్ సౌందర్యకు షాక్.. ఆ సీరియల్ నుంచి తప్పుకున్న అర్చన..?
Karthika Deepam Soundarya: బుల్లితెరపై కార్తీక దీపం(Karthika Deepam Soundarya) సీరియల్‌కు ఉన్న క్రేజ్ లెక్క కట్టాలంటే కొలమానం లేదేమో..? ఆకాశానికి నిచ్చెన వేసినట్లే ఉంటుంది ఈ సీరియల్‌కు ఉన్న ప్రజాదరణ గురించి మాట్లాడుకుంటే.
బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ లెక్క కట్టాలంటే కొలమానం లేదేమో..? ఆకాశానికి నిచ్చెన వేసినట్లే ఉంటుంది ఈ సీరియల్‌కు ఉన్న ప్రజాదరణ గురించి మాట్లాడుకుంటే. ముఖ్యంగా టిఆర్పీ రేటింగ్స్ పరంగా మరే సీరియల్ కూడా కార్తీక దీపం దరిదాపుల్లో కూడా లేదు.
2/ 8
అంత క్రేజ్ తెచ్చుకుంది ఈ సీరియల్. మలయాళ కరతముత్తుకు రీమేక్‌గా రూపొందిన కార్తీక దీపం తెలుగులో ఘన విజయం సాధించింది. ఒరిజినల్ కంటే ఇక్కడే ఎక్కువ రేటింగ్ తెచ్చుకుంటుంది. ఇక ఈ సీరియల్లో నటించిన ప్రతీ ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది.
3/ 8
వాళ్ళను తమ సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తున్నారు అభిమానులు కూడా. కార్తీక దీపంలోని కార్తీక్, దీప పాత్రలు మాత్రమే కాకుండా మోనిత, సౌందర్య, ఇద్దరు పిల్లలు.. ఇలా ప్రతీ ఒక్కరూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైపోయారు.
4/ 8
మరీ ముఖ్యంగా కార్తీక్ తల్లి పాత్రలో నటిస్తున్న అర్చన ఆనంత్ మన ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయిపోయింది. ఒంటి నిండా నగలతో ఎప్పుడూ ఫుల్ మేకప్‌తో ఉండే అర్చనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.
5/ 8
ఈమె స్క్రీన్ నేమ్ సౌందర్య అయినా.. ఒరిజినల్ నేమ్ అర్చన ఆనంత్. ఈ మధ్య సీరియల్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తుంది అర్చన. మొన్నామధ్య విడుదలైన అనసూయ ఓటిటి సినిమా థ్యాంక్యూ బ్రదర్‌లో హీరోకు తల్లిగా నటించింది.
6/ 8
తాజాగా మరో రెండు మూడు సినిమాలు కూడా చేస్తుంది ఈమె. అయితే ఇప్పుడు ఈమెకు ఓ షాక్ తగిలింది. కార్తీక దీపంతో పాటు కేరాఫ్ అనసూయ సీరియల్లోనూ నటిస్తుంది అర్చన.
7/ 8
అందులో ఈమె ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఆమె కారెక్టర్ పేరు అనసూయ. కేరాఫ్ అనసూయ అంటూ ఆమె టైటిల్ రోల్‌తో సీరియల్ మొదలైంది. 100 ఎపిసోడ్స్ కూడా పూర్తి చేసుకుంది ఈ సీరియల్. అయితే కొన్ని రోజులుగా ఇందులో అర్చన కనిపించడం లేదంటూ అభిమానులు దిగులు పడుతున్నారు.
8/ 8
అందులోంచి ఆమెను తప్పించారా లేదంటే ఈమె తప్పుకుందా అనేది అర్థం కావడం లేదు. సినిమా అవకాశాలు వస్తుండటంతో కేరాఫ్ అనసూయ నుంచి ఈమె తప్పుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కారణమేదైనా కూడా అర్చన మాత్రం కేరాఫ్ అనసూయకు దూరం అయిపోయిందంటున్నారు అభిమానులు.