Karthika Deepam: కార్తీకదీపం సీరియల్.. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పాల్సిన పనిలేదు. కొన్ని కోట్లమంది అభిమానులను సంపాదించుకున్న ఈ సీరియల్ ఎంతో ఉత్కంఠంగా సాగుతుంది. సీరియల్ చిన్న పిల్లలా పాత్ర నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు ఎంతో అద్భుతంగా నటిస్తున్నారు. ఇక అలాంటి ఈ సీరియల్ కు త్వరలోనే శుభం కార్డు పడుతుందని గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయ్. దీంతో కార్తీకదీపం అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే కార్తీకదీపం సీరియల్ దర్శకుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయాన్నీ బయటపెట్టేశాడు. ఇప్పట్లో ఈ సీరియల్ కు శుభం కార్డు పడదని.. ఈ సీరియల్ లో ప్రతి పాత్రకు న్యాయం చేస్తూ.. మలుపులు తిరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక అన్నీ పాత్రలకు న్యాయం జరగాలంటే కొన్నేళ్లు పడుతుంది. దీని బట్టి చూస్తే ఇప్పట్లో శుభం కార్డు పడే అవకాశమే లేదని తెలుస్తుంది.