ఈ దీపావళి కానుకగా తెలుగులో కార్తి ‘సర్ధార్’తో పాటు మంచు విష్ణు ‘జిన్నా’. వెంకటేష్, విశ్వక్ సేన్ల ‘ఓరి దేవుడా’తో పాటు మరో తమిళ డబ్బింగ్ చిత్రం శివకార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ విడులయ్యాయి. ఇందులో కార్తి నటించిన సర్ధార్ మూవీ మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాదు. ఈ చిత్రం 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. (Twitter/Photo)
ఇక కార్తి కూడా ఈ యేడాది మణిరత్నం దర్శకత్వంలో చేసిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా సక్సెస్‌తో పూర్తి దూకుడు మీదున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తూ ‘సర్ధార్’ మూవీతో పలకరించారు. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో మంచి విజయం అందుకుంది.తాాజాగా సర్ధార్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అధికారిక ప్రకటన వెలుబడింది. ఈ నెల 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. (Twitter/Photo)
ఈ చిత్రంలో కార్తి తొలిసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభియం చేసారు. ఇందులో చంద్రబోస్ (సర్ధార్) పాత్రలో కనిపించారు. ముఖ్యంగా. ఎక్స్ రా ఆఫీసర్ పాత్రలో కార్తి నటన పీక్స్‌లో ఉంది. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే బంగ్లాదేశ్ చిట్టగాంగ్ జైలు ఎపిసోడ్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. (Twitter/Photo)
సర్ధార్ తెలుగు మూవీ ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ చిత్రం తొలి రోజు తెలుగులో రూ. 0.95 కోట్ల షేర్ రాబట్టింది. 2వ రోజు రూ. 1.05 కోట్ల షేర్ వసూళు చేసింది. 3వ రోజు రూ. 1.48 కోట్లు.. 4వ రోజు రూ. 1.32 కోట్లు.. 5వ రోజు రూ. 0.64 కోట్లు.. 6వ రోజు రూ. 0.44 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్‌లో రూ. 5.88 కోట్లు షేర్ (రూ. 9.75 కోట్లు గ్రాస్) వసూళ్లు చేసింది. మొత్తంగా రూ. 6 కోట్లకు పైగా షేర్.. రూ. 11 కోట్ల గ్రాస్ వసూళ్లతో తెలుగులో సత్తా చాటింది. (Twitter/Photo)
తెలుగులో కార్తి నటించిన ‘సర్ధార్’ మూవీని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నాగార్జున రిలీజ్ చేసారు. తెలుగులో ఈ చిత్రం రూ. 5.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. తాజాగా ఈ సినిమా రూ.6 కోట్లు రాబట్టి లాభాల్లోకి వచ్చింది. మొత్తంగా 0.50 లక్షలు లాభాలతో హిట్ అనిపించుకుంది. ఈ యేడాది తెలుగులో 15వ క్లీన్ హిట్ అనిపించుకున్న చిత్రంగా నిలిచింది. (Twitter/Photo)
తాజాగా ఈ సినిమా ఓటీటీ పార్టనర్ లాక్ అయింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ఆహా కొనుగోలు చేసింది. ఈ సినిమా ఈ నెల 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై అధికారిక ప్రకటన చేశారు. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ఓటీటీ వేదికగా ఎలాంటి హిట్ నమోదు చేస్తుందో చూడాలి. (Twitter/Photo)