ఈ దీపావళి కానుకగా తెలుగులో కార్తి ‘సర్ధార్’తో పాటు మంచు విష్ణు ‘జిన్నా’. వెంకటేష్, విశ్వక్ సేన్ల ‘ఓరి దేవుడా’తో పాటు మరో తమిళ డబ్బింగ్ చిత్రం శివకార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ విడులయ్యాయి. ఇందులో కార్తి నటించిన సర్ధార్ మూవీ మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాదు. తాజగా 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. (Twitter/Photo)
సర్ధార్ తెలుగు మూవీ ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఈ చిత్రం తొలి రోజు తెలుగులో రూ. 0.95 కోట్ల షేర్ రాబట్టింది. 2వ రోజు రూ. 1.05 కోట్ల షేర్ వసూళు చేసింది. 3వ రోజు రూ. 1.48 కోట్లు.. 4వ రోజు రూ. 1.32 కోట్లు.. 5వ రోజు రూ. 0.64 కోట్లు.. 6వ రోజు రూ. 0.44 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్లో రూ. 5.88 కోట్లు షేర్ (రూ. 9.75 కోట్లు గ్రాస్) వసూళ్లు చేసింది. (Twitter/Photo)
తెలుగులో కార్తి నటించిన ‘సర్ధార్’ మూవీని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై నాగార్జన రిలీజ్ చేసారు. తెలుగులో ఈ చిత్రం రూ. 5.50 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. తాజాగా ఈ సినిమా నిన్నటితో రూ. 5.88 కోట్లు రాబట్టి లాభాల్లోకి వచ్చింది. మొత్తంగా 0.38 లక్షలు లాభాలతో హిట్ అనిపించుకుంది. ఈ యేడాది తెలుగులో 15వ క్లీన్ హిట్ అనిపించుకున్న చిత్రంగా నిలిచింది. (Twitter/Photo)