Karthi - Japan : కార్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సూర్య తమ్ముడుగా ఇక్కడికి వచ్చిన ఈయన.. కార్తి అన్న సూర్య అనే స్థాయికి ఎదిగాడు. గతేడాది ‘పొన్నియన్ సెల్వన్ -1,’ ‘సర్ధార్’ మూవీతో పలకరించిన ఇతను ..రీసెంట్గా ‘పొన్నియన్ సెల్వన్ 2’ మూవీతో పలకరించాడు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ రోజు కార్తి బర్త్ డే సందర్బంగా ఈయన హీరోగా నటిస్తోన్న ‘జపాన్’ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. (Twitter/Photo)
ఈ ఫస్ట్ లుక్‌లో జపాన్ దేశానికి వ్యక్తి పాత్రలో కార్తి నటిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ దేశపు ఆహార్యంలో చేతిలో గోల్డెన్ కలర్ డ్రెస్‌లో గోల్డెన్ కలర్ గన్‌తో రెండు చేతులతో గురి పెడుతున్న ఫోటో ఇపుడు వైరల్ అవుతోంది. ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచిన ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (File/Photo)
‘జపాన్’ అంటూ వేరే దేశం టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజు మురుగున్ కథతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసాడు. గతేడాది దీపావళి కానుకగా ‘సర్థార్’తో మంచి హిట్ అందుకున్న కార్తి.. ఈ దీపావళికి కూడా హిట్టు కొట్టేలా ఉన్నాడు. ఈ సారి విజయ్.. ‘లియో’ సినిమాతో కూడా పోటీలో ఉంది. (Twitter/Photo)