రామ్ మనోహర్ లోహియా శిష్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత దేవగౌడకు చెందిన జనతాదళ్ యునైడైట్లో లీడర్‌గా ఎదిగి.. ఆ తర్వాత సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదుడుగులు తిని అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా.. ముఖ్యమంత్రిగా ఎదిగారు. కాంగ్రెస్ తరుపున ఐదేళ్లు సీఎంగా ఉన్నారు. ఈ సినిమాను కాంగ్రెస్‌కు చెందిన శివకుమార్‌తో శివరాజ్ తంగడాగి ఈ సినిమాను నిర్మించబోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కనకగిరికి చెందిన నాయకులు ఈ బయోపిక్‌పై రీసెర్చ్ చేసి సిద్దరామయ్యను కలిసి ఆయన అనుమతి తీసుకున్నారట.
ఈ సినిమాలో సిద్దరామయ్య పాత్రలో విజయ్ సేతుపతి నటించబోతున్నట్టు సమాచాారం. ఈ సినిమాను డిసెంబర్లో మొదలు పెట్టి.. ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికల ముంగిట విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఒక అట్టడుగు స్థాయి నుంచి సీఎంగా ఎదిగిన సిద్దరామయ్య జీవితంలో ఓ సినిమాకు సంబంధించిన ట్విస్టులున్నాయట. మరి నిజంగానే సిద్దరామయ్య బయోపిక్కు కాంగ్రెస్ అధిష్ఠానం పర్మిషన్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గాంధీ, నెహ్రూ కుటుంబాలకు ఉన్న ప్రాధాన్యత ఇతర నాయకులకు ఉండదు. మరి నిజంగానే సిద్దరామయ్య బయోపిక్ కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఇతర పొలిటిషన్స్ బయోపిక్ విషయానికొస్తే..
మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు రామారావు జీవితకథను ఆయన తనయుడు బాలకృష్ణ...నటిస్తూ ఈ బయోపిక్‌ను తెరకెక్కించాడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలుగా తెరకెక్కింది. ఈ చిత్రం సరైన విజయం సాధించలేదు.(Twitter/Photo)
‘ఉద్యమ సింహం’ సినిమా తర్వాత కేసీఆర్ జీవితంపై ‘తెలంగాణ దేవుడు’ పేరుతో శ్రీకాంత్ హీరోగా ఒక సినిమా అనౌన్స్ చేసారు. ఈ సినిమా విడుదలైన సంగతే చాలా మందికి తెలియదు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ కూడా తెలంగాణ సీఎం జీవితంపై ఒక బయోపిక్ అనౌన్స్ చేసాడు. వీటితో పాటు కేసీఆర్ జీవితంపై మరికొన్ని చిత్రాలు తెరకెక్కబోతున్నట్టు ప్రకటించినా.. ఏవి కార్యరూపం దాల్చలేదు. (Twitter/Photo)