Kargil Vijay Diwas: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా టాలీవుడ్ తెరపై రియల్ హీరో సైనికుల పాత్రల్లో మెప్పించిన రీల్ హీరోలు..

జై జవాన్ జై కిసాన్ అని మన రెండో దేశ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చారు. ఆ స్పూర్తితో తెలుగు తెరపై అపుడుపుడు హీరోలు రియల్ హీరోలైన సైనికుడి పాత్రలో తెరపై కనిపించి అలరించారు. ఈ రోజు పాకిస్థాన్ పై మన దేశం విజయం సాధించిన సందర్భంగా విజయ్ దివస్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నేటితో కార్గిల్ విజయ దినోత్సవానికి 22 యేళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా సైనికుల స్పూర్తితో వెండితెరపై అలరించిన తెలుగు హీరోలపై ఫోకస్.