కరీనా, సైఫ్‌ల రెండో అబ్బాయికి జహాంగీర్ అలీ ఖాన్ అనే పేరు పెట్టారు. మొదటి అబ్బాయి పేరు తైమూర్ అలీ ఖాన్. అప్పట్లో తైమూర్ పేరుపై పెద్ద వివాదమే చెలరేగింది. ఇక కరీనా పెద్ద కుమారుడు తైమూర్ సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అయ్యారు. అతని మూమెంట్స్‌తో పాటు అతని పనులను కరీనా ఎప్పటి కపుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు దగ్గర చేసింది. (Instagram/Photo)
కరీనా రెండో కుమారుడు జహాంగీర్ అలీ ఖాన్‌ను సైఫ్, కరీనా దంపతులకు ఫిబ్రవరిలో జన్మించారు. ఇక కరీనా ‘లాల్ సింగ్ చద్ధా’ షూటింగ్లో జాయిన్ అప్పటి నుంచి రెండు కుమారుడు ఆమె వెంటే ఉన్నాడు. రెండో కుమారుడుతో పాటు మొదటి కొడుకు తైమూర్ ను కరీనా తన షూటింగ్ స్పాట్‌కు తీసుకెళుతూ ఉందట. ఒకవైపు షూటింగ్స్ చేస్తూనే ఇద్దరు కుమారుల బాగోగులను కరీనా చూసుకుంటోంది. వీరిద్దరి కోసం ఇద్దరు ఆయాలు కూడా ఉన్నారు. ఎంత ఆయాలున్నా.. సెట్స్‌లో షూటింగ్ కాగానే పిల్లలతో గడుపుతుందట . (Instagram/Photo)