కరీనా కపూర్..(Kareena Kapoor) ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దశాబ్దానికిపైగా బాలీవుడ్ ని ఏలింది బేబో. ఇక 2012లో సైఫ్ అలీ ఖాన్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు కరీనా. సైఫ్ కి ఇది రెండవ వివాహం. గతంలో అమృత సింగ్ ని వివాహం చేసుకొని ఆమెకు విడాకులు ఇచ్చారు. అమృతా సింగ్ కి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ ఇద్దరు పిల్లలు. లేటెస్ట్ గా సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ దంపతులు రీసెంట్గా రెండో సంతానికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా. రెండో సారి వీళ్లకు మగ పిల్లాడు కలిగాడు. (Photo Credit : Instagram)
ఇద్దరు పిల్లల తల్లి అయినా చెక్కు చెదరని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తోంది కరీనా కపూర్. ఒద్దికైన శరీర సౌష్టవం కోసం కఠిన శ్రమకోర్చే బెబో తాజా లుక్ చూస్తే అలాగే అనిపిస్తోంది మరి. రెండో కుమారుడు ‘జే’ జన్మించిన తర్వాత కాస్త విరామం తీసుకున్న కరీనా.. ప్రస్తుతం యాడ్ షూట్లతో బిజీ అయ్యింది. (Photo Credit : Instagram)