కాంతార సినిమా క్లైమాక్స్ ఎంత హాట్ టాపిక్ అయిందో తెలిసిందే. ఈ సినిమా చివరి 20 నిమిషాలు ప్రతి ప్రేక్షకుడికి నచ్చుతుంది. కాంతార క్లైమాక్స్ గురించి అగ్ర నటుల నుండి సామాన్యుల వరకు అందరూ మాట్లాడుకున్నారు.
2/ 7
తాజాగా రిషబ్ శెట్టి కాంతార క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. క్లైమాక్స్ షూటింగ్ సమయంలో ఎదురైన సవాళ్ల గురించి ఆయన వివరించారు.
3/ 7
కాంతార క్లైమాక్స్ రాత్రి షూటింగ్ గురించి రిషబ్ మాట్లాడుతూ.. ఇక్కడ ప్రీ క్లైమాక్స్ నైట్ సన్నివేశాన్ని 360 డిగ్రీలలో చిత్రీకరించామన్నారు, అప్పుడు భారీ వర్షం కూడా కురిసిందన్నారు.
4/ 7
రాత్రి వర్షం ఎఫెక్ట్‌తో షూటింగ్ చేయాల్సి వచ్చిందన్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు షూటింగ్ రిహార్సల్ కూడా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
5/ 7
దాదాపు 7 రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్ జరగడం వల్ల చాలా నీటి అవసరం ఏర్పడింది. అందుకు సమీపంలోని బావి నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు రిషబ్ శెట్టి.
6/ 7
దీంతో అక్కడున్న బావిలోంచి నీళ్లు తీసుకున్నామన్నారు. మేము 7 రోజులు అక్కడ నీరే ఉపయోగించామన్నారు. షూటింగ్ పూర్తయ్యాక నీళ్లు కూడా ఖాళీగా అయిపోయాయని రిషబ్ శెట్టి తెలిపారు.
7/ 7
వర్షం కురవడం వల్ల రాత్రి సన్నివేశాల చిత్రీకరణ కాస్త కష్టమైందని తెలిపారు. అయితే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు షూటింగ్ చేస్తునే ఉన్నామన్నారు.