Kantara-Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ ఇచ్చిన కాంతార...ఇదీ విషయం !
Kantara-Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ ఇచ్చిన కాంతార...ఇదీ విషయం !
కాంతార సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాను అల్లు అర్జున్ సూపర్ డూపర్ హిట్ మూవీ పుష్పతో పోల్చుతున్నారు నెటిజన్లు. దీనిపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ... చర్చించుకుంటున్నారు.
కాంతార పెద్ద విజయం సాధించిన తర్వాత ఈ సినిమాని ఇతర సినిమాలతో పోల్చుతూ రకరకాలుగా ప్రశంసిస్తున్నారు. కంటెంట్, కథ, బడ్జెట్, సినిమా స్కోప్ ఇలా అన్ని కోణాల్లో కాంతారను ఇతర సినిమాలతో పోల్చి చూస్తున్నారు.
2/ 7
కాంతార చాలా చిన్న సినిమా. అత్యంత తక్కువ బడ్జెట్‌తో దీన్ని నిర్మించారు. ఈ సినిమాను దాదాపు 14-16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. కాంతారకు ఇంకా తక్కువ బడ్జెట్ ఫిక్స్ చేసారు. అయితే ఫిక్స్డ్ బడ్జెట్ కాస్త పెరిగింది.
3/ 7
అయితే కాంతార సినిమా కోసం పెట్టుబడి పెట్టిన హోంబలే ఫిల్మ్స్‌కు భారీ రాబడులు వచ్చాయి. కాసుల వర్షం కురిసింది. కేవలం 16 కోట్ల సినిమా తీస్తే.. ఇప్పుడు 400 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.
4/ 7
అయితే ఇప్పుడు తాజాగా నెటిజన్లు కాంతార సినిమాను.. పుష్ప సినిమా బడ్జెట్ కలెక్షన్లతో సరిపోల్చుతున్నారు. కాంతార బడ్జెట్ ఎంత..? పుష్ప బడ్జెట్ ఎంత.. ఎంత రాబట్టింది అన్న లెక్కలు తీస్తున్నారు.
5/ 7
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ సినిమా దాదాపు 160 నుంచి 170 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. అయితే పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద 350 కోట్లు వసూలు చేసింది.
6/ 7
కానీ కేవలం 16 కోట్లతో రూపొందిన కాంతారావు 350 కోట్లకు పైగానే వసూలు చేసింది. సాధారణంగా సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు ఒకేలా ఉన్నప్పటికీ బడ్జెట్లో మాత్రం చాలా తేడా ఉందని నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు.
7/ 7
నెటిజన్లు ఇప్పుడు రెండు సినిమాల బడ్జెట్ మరియు బాక్సాఫీస్ కలెక్షన్లను పోల్చి పోస్ట్‌లను ఆన్లైన్లో షేర్ చేస్తున్నారు. అల్లు అర్జున్ పుష్పకు కాంతార కలెక్షన్ల విషయంలో బిగ్ షాక్ ఇచ్చిందని అంటున్నారు.