కాంతార.. మొన్నటి వరకు ఎక్కడ చూసిన దీని గురించే చర్చ.. రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా కన్నడలో కంటే తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై విడుదల చేశారు. అక్టోబర్ 15వ తేదీన విడుదలై ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. Photo : Twitter
అది అలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఇంగ్లీష్ భాషలోను డబ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషాల్లో అందుబాటులో ఉండగా.. ఇక లేటెస్ట్గా ఈ సినిమాలను నిర్మాతలు ఇంగ్లీష్‌లో కూడా డబ్ చేసి విడుదల చేయాలని చూస్తున్నారట. అయితే ఆ ఇంగ్లీష్ వర్షన్ థియేటర్స్‌లో విడుదలకానుందా లేక ఓటీటీకే పరిమితం కానుందా అనేది తెలియాల్సి ఉంది. Photo : Twitter
ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో బాక్సాఫీస్ వద్ద రూ. 60 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి వావ్ అనిపించింది. ఇక షేర్ 30 కోట్లకు ఉండోచ్చని, ఇక ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల వరకు గ్రాస్ వసూలు అయ్యిందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక అది అలాఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో ఇప్పటికే రకరకాల వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా.. అగ్నీస్ లోకనాథ్ సంగీతం అందించారు. కెజీయఫ్ నిర్మించిన హోంబళే ఫిల్మ్స్ ఈ సినిమాను ప్రోడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమా తెలుగు వర్షన్‌ను అల్లు అరవింద్ కేవలం రెండు కోట్లకు కొన్నారట. దీంతో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని అల్లు అరవింద్‌కు కాంతార కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. Photo : Twitter