2022లో ఆగష్టు టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఒక రోజు విడుదలైన కళ్యాణ్ రామ్ ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ ‘సీతా రామం’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఆగష్టు 13న విడుదలైన నిఖిల్ సిద్ధార్ధ్.. ‘కార్తికేయ 2’ సినిమా విడుదలైన మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. తాజాగా అక్టోబర్ 15న విడుదలైన ’కాంతార’ సినిమా ఫస్ట్ టూ డేస్‌లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. (Twitter/Photo)
రిషబ్ శెట్టి ఈ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగిపోతూనే ఉంది. కాంతార ది లెజెండ్ అంటూ కర్నాటకలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా అక్కడ జానపద కళ మన దగ్గర కొలం (సిగమూగే) ను ఎంత చక్కగా తెరపై ఆవిష్కరించాడు. ఈ సినిమా షూట్ రిషబ్ శెట్టి వాళ్ల సొంత ఊర్లో జరిపడం విశేషం.స్వయంగా వాళ్ల కుటుం సభ్యులు కొలం చేస్తారని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా మూడు రోజుల్లో పెట్టిన పెట్టుబడికి తిరగొచ్చేసి లాభాల్లోకి వచ్చింది. (Twitter/Photo)
సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ తాజాగా చేసిన మూవీ కార్తికేయ 2. ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) హీరోయిన్ గా నటించింది. దాదాపు రూ. 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 15 కోట్లు రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. మొత్తంగా 3 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. (Twitter/Photo)
Bimbisara - Sita Ramam | బింబిసార, సీతా రామం మూవీలురెండు సినిమాలు ఒకే రోజు ఒకేసారి విడుదలై సంచలన విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు కూడా వారంలోపు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఇక బింబిసార మూవీ మూడు రోజుల్లో లాభాల్లో వస్తే.. సీతా రామం మూవీ 5 రోజుల్లో ఫ్రాఫిట్స్లోకి వచ్చింది. ఒకే రోజు విడుదలైన రెండు స్ట్రెయిట్ చిత్రాలు లాభాల్లో రావడం మాములు విషయం కాదు. (Twitter/Photo)
1st Week Break Movies : గత కొన్నేళ్లుగా విడుదలవుతున్న అన్ని సినిమాలకు మొదటి మూడు రోజుల వసూళ్లే కీలకం. వాటి ఆధారంగానే ఈ సినిమా పెట్టిన బడ్జెట్ వెనక్కి తిరిగి వస్తుందా లేదా అనేది డిసైడ్ అవుతోంది. వర్కింగ్ డేస్‌లో ఎలాగు ప్రేక్షకులు థియేటర్స్ ముఖం చూడటం లేదు. దీంతో కలెక్షన్లు తగ్గడం సహజం. వాళ్లీ వీకెండ్ వచ్చే వరకు ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడరు. ఇక హై బడ్జెట్ మూవీస్‌తో పోలిస్తే.. మీడియం, చిన్న సినిమాలకు పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఈ సినిమాకు బిజినెస్ తక్కువ రేంజ్లో జరుగోంది. ఒక వేళ హిట్ వస్తే.. మొదటి వీకెండ్ లేకపోతే.. ఫస్ట్ వీక్ లోపే హిట్ స్టేటస్ అందుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మొత్తంగా ఈ యేడాది టీజే టిల్లు, మేజర్, విక్రమ్, బింబిసార, సీతారామం, కార్తికేయ 2, కాంతార సినిమాలు మొదటి వారంలోపే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి రావడం విశేషం.
బింబిసార | కళ్యాణ్ రామ్ బింబిసార మూవీని కళ్యాణ్ రామ్ తన మార్కెట్ రేంజ్‌కు అనుగుణంగా అమ్మారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 18.29 కోట్ల షేర్ రాబట్టి హైయ్యెస్ట్ షేర్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 2.09 కోట్ల లాభాల్లోకి వచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు 37.92 కోట్ల షేర్ (రూ. 65.20 కోట్ల గ్రాస్) వసూళ్లు రాబట్టింది.(Twitter/Photo)
సీతా రామం | వైజయంతీ మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ నిర్మాతగా.. సెన్నిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సీతా రామం’. దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా రష్మిక మందన్న మరో ముఖ్యపాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా 5వ రోజు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. వారం రోజుల్లో ఈ సినిమా రూ. 19.18 కోట్లు షేర్ (37.80 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా చూస్తే..రూ. 46.50 కోట్ల షేర్ (రూ. 98.10 కోట్ల గ్రాస్) వసూళ్లు వచ్చాయి. (Twitter/Photo)
మేజర్ | అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘మేజర్’. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో రూ. 13 కోట్లకు అమ్మారు. ప్రపంచ వ్యాప్తంగా అదనంగా రూ. 5 కోట్లు కలిపి రూ. 18 కోట్లకు అమ్ముడుపోయింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన మేజర్ మూవీ మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 27.76 కోట్ల షేర్ ( రూ. 50.30 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా రూ.9 కోట్ల వరకు లాభాలను తీసుకొచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 17.85 కోట్ల షేర్ (రూ. 29.80 కోట్ల గ్రాస్) రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా మిగతా భాషల్లో కలిపి ఈ సినిమా రూ. 33.35కోట్ల షేర్ (రూ. 64 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. హిందీ + రెస్టాఫ్ భారత్ కలిపి ఈ సినిమా రూ. 7.05 కోట్ల షేర్.. (రూ. 15 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఇక అడివి శేష్ కెరీర్లోనే తొలి రూ. 60 కోట్ల గ్రాస్ సినిమాగా మేజర్ సినిమా రికార్డులకు ఎక్కింది. మొత్తంగా రూ. 15 కోట్లు లాభాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
విక్రమ్ | కమల్ హాసన్ ముఖ్యపాత్రలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటించిన మూవీ విక్రమ్. తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్ల షేర్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా నాలుగు రోజుల్లో లాభాల్లోకి వచ్చింది. దాదాపు విశ్వరూపం తర్వాత తమిళం, తెలుగులో ఈ సినిమాతో హిట్ అందుకున్నారు కమల్ హాసన్. ఈ సినిమా నాల్గు రోజుల్లో రూ. 7.50 కోట్లను రాబట్టి హిట్ స్టేటస్ అందుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా తెలుగులో రూ. 12.53 కోట్ల షేర్ రాబట్టింది. బయ్యర్స్‌కు రూ. 5 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్‌గా రూ. 138 కోట్ల షేర్ (రూ. 273 కోట్ల గ్రాస్ ) వసూళ్లను సాధించింది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా రూ. 7.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఓవరాల్‌గా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 17.80 కోట్ల షేర్ ( రూ. 31.40 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి దాదాపు పది కోట్లకు పైగా లాబాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)
3. డిజే టిల్లు: రవితేజ సినిమాకు పోటీగా వచ్చిన డిజే టిల్లు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది. పెద్దగా సందడి లేకుండా వచ్చిన టిల్లు భాయ్ మంచి లాభాలు తీసుకొచ్చాడు. రూ. 9 కోట్ల బడ్జెట్‌తో బరితో దిగిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 9.2 కోట్ల షేర్ రాబట్టి హిట్‌గా నిలిచింది. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఫిబ్రవరిలో మొదటి హిట్‌గా నిలిచింది. విమల్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే కూడా అందించాడు.
‘జాతి రత్నాలు’ | నాగ్ అశ్వన్ నిర్మాణంలో అనుదీప్ దర్శకత్వంలోొ నవీన్ పోలీశెట్టి, ఫరియా అబ్దుల్లా హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘జాతి రత్నాలు’. రూ. 10.08 కోట్ల టార్గెట్ బ్రేక్ ఈవెన్‌తో బరితో దిగిన ఈ సినిమా వీకెండ్ ముగిసే వరకు రూ 14 కోట్ల షేర్ రాబట్టి సూపర్ హిట్ లిస్టులో చేరింది. (Twitter/Photo)
Uppena @ 1 year: అప్పుడప్పుడే కరోనా మెల్లగా తగ్గుముఖం పడుతుంది. దానికి తోడు సంక్రాంతి సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించాయి. అలాంటి సమయంలో వచ్చింది ఉప్పెన (Uppena @ 1 year) సినిమా. గతేడాది సరిగ్గా ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రూ. 20 కోట్ల టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ సినిమా వీకెండ్ ముగిసేవరకు రూ. 25 కోట్ల రాబట్టి హిట్ లిస్టులో చేరింది. (Twitter/Photo)
2. మాస్టర్: తెలుగు సినిమా కాకపోయినా కూడా తెలుగులో మంచి విజయం సాధించింది మాస్టర్. జనవరి 13న విడుదలైన మాస్టర్ సినిమా దాదాపు 12 కోట్ల షేర్ వసూలు చేసింది. విజయ్‌కు తెలుగులో మార్కెట్ భారీగా పెరిగింది అనేది మాస్టర్ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. తెలుగులో రూ. 8 కోట్ల టార్గెట్‌తో బరిలో దిగి వీకెండ్ ముగిసే వరకు రూ. 10 కోట్ల షేర్ రాబట్టి హిట్ లిస్టులో చేరింది. (Twitter/Photo)