KANNADA SERIAL ACTRESS RASHMI PRABHAKAR TIES THE KNOT WITH NIKHIL BHARGAV VDD TRANSPG
Rashmi: పెళ్లి చేసుకున్న సీరియల్ నటి రష్మి.. ఫోటోలు వైరల్
కన్నడ సీరియల్ నటి పెళ్లి చేసుకుంది. నిఖిల్ భార్గవ్‌ను ఆమె వివాహం చేసుకుంది. బసవనగుడిలోని శ్రీ ధర్మస్థల మంజునాథ్ కళ్యాణ మండపంలో సోమవారం ఉదయం 9.21 గంటల నుంచి 10.19 గంటల వరకు వీరి కల్యాణం ఘనంగా జరిగింది.
నటి రష్మీ ప్రభాకర్ 'లక్ష్మీ బారమ్మ', 'శుభవిహ', 'జీవనచైత్ర', 'మనసెల్ల తొమ్మిది', 'మహాభారతం', 'దర్పణ', తమిళ 'అరుంధతి', తెలుగులో 'పౌర్ణమి', 'కవాంజలి' చిత్రాల్లో నటించారు.
2/ 7
రష్మి .. ఓ అడ్వర్టైజింగ్ కంపెనీలో పనిచేస్తున్న నిఖిల్ భార్గవతో వివాహమైంది. సంప్రదాయబద్ధంగా వీరిద్దరు వివాహం చేసుకున్నారు.
3/ 7
నిఖిల్-రష్మీ గత మూడేళ్లుగా స్నేహితులు. నిఖిల్-రష్మీల పెళ్లికి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు.
4/ 7
నిఖిల్ గతంలో ఓ ఛానెల్లో పనిచేసేవాడు. నిఖిల్ రష్మీకి నటన విషయంలో కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాడు. పెళ్లి తర్వాత కూడా రష్మీ నటిస్తూనే ఉంటుంది.
5/ 7
రష్మి.. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇప్పుడు ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
6/ 7
బసవనగుడిలోని శ్రీ ధర్మస్థల మంజునాథ్ కళ్యాణ మండపంలో సోమవారం ఉదయం 9.21 గంటల నుంచి 10.19 గంటల వరకు వీరి కల్యాణం ఘనంగా జరిగింది.
7/ 7
పెళ్లి విషయంలో తాను తొందర పడటం లేదని రష్మి గతంలోనే చెప్పింది. ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా శాస్త్రోక్తంగా వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.