Sapthami Gowda: కాంతార 'లీల' నెక్ట్స్ సినిమా ఇదే.. ఈ హీరో కుమారుడితో రొమాన్స్
Sapthami Gowda: కాంతార 'లీల' నెక్ట్స్ సినిమా ఇదే.. ఈ హీరో కుమారుడితో రొమాన్స్
Kantara | Sapthami Gowda: కాంతార సినిమాలో రిషభ్ శెట్టితో పాటు సప్తమి గౌడ నటనకు కూడా అభిమానులు ఫిదా అయ్యారు. సహజ అందం, అభినయంతో ఆకట్టుకుంది. మరి ఈమె నటించే తదుపరి చిత్రమేంటో తెలుసా..?
ప్రపంచవ్యాప్తంగా కాంతార మూవీ సంచలనాలు సృష్టిస్తోంది. పెద్ద పెద్ద మూవీలను కాదని.. కలెక్షన్ల వర్షం కురిపించింది. కన్నడలో చిన్న మూవీగా విడుదలై.. ఆ తర్వాత అన్ని భాషల్లోనూ అదరగొట్టింది.
2/ 7
మొదట కన్నడలో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో కూడా విడుదలై..అంతకు మించిన బ్లాక్ బస్టర్ అయ్యింది. కేవలం మౌత్ టాక్‌తోనే కలెక్షన్ల సునామీ సృష్టించింది.
3/ 7
కాంతార సినిమా రూ.20 కోట్ల లోపు బడ్జెట్‌తోనే తెరకెక్కిందట. కానీ కలెక్షన్లు మాత్రం అందుకు పదుల రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించింది. ఇప్పటి వరకు దాదాపు రూ.400 కోట్ల వసూళ్లు రాబట్టింది.
4/ 7
కాంతార సినిమాలో రిషభ్ శెట్టి దర్శకత్వం, నటన అద్బుతంగా ఉందని ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో ఆయన నటన పూనకాలు తెప్పిస్తుంది. ఐతే రిషభ్ శెట్టితో పాటు సప్తమి గౌడ సహజ అందం, నటనకు కూడా అభిమానులు ఫిదా అయ్యారు.
5/ 7
కాంతార సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో హీరోయిన్ సప్తమి గౌడకు కన్నడ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అంతకు ముందు కూడా పలు సినిమాల్లో ఆమె నటించింది. కానీ కాంతార తర్వాత వరుస ఛాన్స్‌లు వస్తున్నాయి.
6/ 7
కన్నడ నటుడు అంబరీష్, సుమలత కుమారుడు అభిషేక్‌తో నెక్ట్స్ మూవీ చేస్తోంది సప్తమి గౌడ. 1990 నాటి నేపథ్యంలో ఓ ప్రేమ కథలో సప్తమి గౌడ హీరోయిన్గా నటించనున్నట్లు సమాచారం.
7/ 7
అభిషేక్ కథనాయకుడిగా కాళీ అనే సినిమాకు ఎస్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా సప్తమి గౌడను ఎంపిక చేసినట్లు కన్నడ సినీ వర్గాల ద్వారా తెలిసింది. నవంబరులో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.