KANGANA RANAUT TO TAKE BHARATANATYAM DANCE COACHING FOR JAYALALITHAA BIOPIC AK
జయలలిత బయోపిక్ కోసం కంగనా ప్రాక్టీస్ షురూ...
తమిళనాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌లో నటించేందుకు కమిటైన కంగనా రనౌత్... ఈ సినిమా కోసం అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిందని తెలుస్తోంది. తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో నటించి ప్రేక్షకులకు జయలలితను గుర్తు చేయాలని భావిస్తోంది కంగనా. జయలలిత సినిమాల్లోకి రాకముందు క్లాసికల్ డ్యాన్స్‌లో పట్టు సంపాదించడంతో... కంగనా కూడా క్లాసికల్ డ్యాన్స్‌పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఆమె ఓ ప్రముఖ క్లాసికల్ డ్యాన్సర్ దగ్గర భరతనాట్యంలో శిక్షణ తీసుకుంటోందని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది.