Kangana Ranaut : హిందీ నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన 'ఏక్ నిరంజన్' సినిమాలో ప్రియురాలు 'సమీర'గా ఇరగదీసిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా యావరేజ్ టాక్ రావడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే హిందీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్.. . Photo : Instagram
అంతేకాదు మంచి నటిగా కూడా పేరు సంపాదించుకున్నారు అక్కడ. ఆమె ఇప్పటికే మణికర్ణిక, తలైవి అంటూ పలు బయోపిక్‌ల్లో నటించారు. ఇక తాజాగా ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించనున్నారు. ఈ చిత్రానికి 'ఎమర్జెన్సీ' అనే పేరును ఖరారు చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. . Photo : Instagram
నటి కంగనా రనౌత్ అటు హిందీలో నటిస్తూనే ఇటు సౌత్‌లో కూడా వీలున్నప్పుడల్లా నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆమె నటించన చిత్రం తలైవి. ఈ సినిమా తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాకు బాహుబలితో సూపర్ పాపులర్ అయిన రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. . Photo : Instagram
ఏ ఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10న విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషాల్లో ఒకేసారి విడుదలైంది. ఇక కంగనా ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఈ సినిమాతో పాటు కంగనా హిందీలో ‘తేజస్’, ’ధాకడ్’ అనే మరో రెండు సినిమాలను చేస్తోంది. . Photo : Instagram
ముఖ్యంగా 'ఎమర్జెన్సీ అండ్ ఆపరేషన్ బ్లూస్టార్' పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఇదో పొలిటికల్ డ్రామా అంటున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏమంటే ఈ చిత్రనిర్మాణంలో కంగనా రనౌత్ కూడా భాగస్వామిగా ఉంటున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ఆమె వహించనున్నారని తెలుస్తోంది. Photo : Instagram