శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఎట్టిపరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే కు మద్దతు ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పడంతో బీజేపీ అతి త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని తేలిపోయింది.సొంత పార్టీ నేతలను ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోయారు అంటూ ఉద్దవ్ పై మహా వికాస్ అఘడిలోని ఇతర పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తన్నారు.
సీఎంపై అప్పట్లో కంగనా చేసిన కామెంల్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇప్పుడు మహారాష్ట్రలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో మరోసారి సోషల్ మీడియా పట్టాలు ఎక్కింది ఆ వీడియో. ఆమె శాపం చాలా తక్కువ సమయంలోనే నిజం అయ్యింది అన్నట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె అభిమానులు వాఖ్యలుచేస్తూ ఆ వీడియోలను షేర్ చేస్తున్నారు.