గతేడాది ‘ధాకడ్’ డిజాస్టర్ తర్వాత ‘ఎమర్జన్సీ’ సినిమాను తన స్వీయ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటించనున్నారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ 1975లో విధించిన ఎమర్జన్సీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించినట్టు చెప్పారు. ఈ సినిమా కోసం కంగనా తన ఆస్తులున్ని తాకట్టు పెట్టినట్టు చెప్పుకొచ్చారు. Photo : Instagram
ఎమర్జన్సీ సమయంలో ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ షాడో ప్రధాన మంత్రిగా ఎలా ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసారనేదే ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు కంగనా పేర్కొన్నారు. ముఖ్యంగా 'ఎమర్జెన్సీ అండ్ ఆపరేషన్ బ్లూస్టార్' పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఇదో పొలిటికల్ డ్రామా. ఇక్కడ కొసమెరుపు ఏమంటే ఈ చిత్రనిర్మాణంతో పాటు, ఈ సినిమాకు దర్శకత్వం కూడా కంగనా రనౌతే చేయనున్నారు. Photo : Instagram
గతంలో కూడా కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. ఆమె 2019లో విడుదలైన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీకి దర్శకత్వం వహించారు. ఇక ఆమె లేటెస్ట్ చిత్రం ఎమర్జెన్సీ నుండి దివంగత భారత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో ఉన్న తన ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అది అలా ఉంటే కంగనా రనౌత్(Kangana Ranaut) మరోసారి తన లేటెస్ట్ సినిమా ‘ధాకడ్’(Dhaakad) పరాజయంపై స్పందించింది. ఆమె తన తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడుతూ.. ‘ధాకడ్’ కారణంగా ఆ చిత్ర నిర్మాత ఆస్తులు అమ్ముకున్నారని వస్తున్న వార్తలను ఖండించింది. తన ధాకడ్ సినిమాకు పెట్టిన ఖర్చులను నిర్మాత తిరిగి పొందారని తెలిపింది. తన సినిమా ధాకడ్‌పై విడుదలకు ముందే వ్యతిరేక ప్రచారం రావడంతో అది పరాజయం పాలైందని తెలిపింది. Photo : Instagram
తన పై నెగెటివ్ ప్రమోషన్ చేసే ఆ సంస్థలు ఆలియా భట్ నటించిన గంగూబాయి కాతియావాడి (Gangubai Kathiawadi), జుగ్‌జుగ్‌జీయో(Jugjugg Jeeyo), దీపికా, రణవీర్ కపూర్ నటించిన 83 లాంటి ఫ్లాప్ సినిమాల గురించి.. ఆ హీరో హీరోయిన్ల గురించి ఎందుకు రాయరని ప్రశ్నించింది. ఇక కంగన నటించిన ‘ధాకడ్’ ప్రస్తుతం జీ5 ఓటీటీలో ప్రసారం అవుతోంది. Photo : Instagram
దాదాపుగా 80కోట్ల బడ్జెట్‌తో కొత్త దర్శకుడు రజనీష్ ఘాయ్ తెరకెక్కించని ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం 4కోట్లరూపాయల వసూళ్లతో దారుణంగా విఫలమైందని ట్రేడ్ వర్గాలు పేర్కోన్నాయి. ధాకడ్ చిత్రంలో కంగనా తో పాటు ఇతర ముఖ్యపాత్రల్లో అర్జున్ రాంపాల్ (Arjun Rampal), దివ్యదత్తా(Divya Dutta) నటించారు. Photo : Instagram
Kangana Ranaut : హిందీ నటి కంగనా సినీ కెరీర్ విషయానికి వస్తే.. కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర లేదు.. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన 'ఏక్ నిరంజన్' సినిమాలో ప్రియురాలు 'సమీర'గా ఇరగదీసిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా యావరేజ్ టాక్ రావడంతో కంగనాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే హిందీలో ఆమె ఓ ఫైర్ బ్రాండ్.. . Photo : Instagram
నటి కంగనా రనౌత్ అటు హిందీలో నటిస్తూనే ఇటు సౌత్‌లో కూడా వీలున్నప్పుడల్లా నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆమె నటించన చిత్రం తలైవి. ఈ సినిమా తమిళ ప్రజల ఆరాధ్య ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాకు బాహుబలితో సూపర్ పాపులర్ అయిన రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. . Photo : Instagram