Kamal Haasan | Vikram OTT Date | విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నటించిన లేటెస్ట్ సినిమా (Vikram) ‘విక్రమ్’. ఈ సినిమాకు (Lokesh Kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించారు. మరో తమిళ నటుడు సూర్య (Suriya) కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా జూన్ 3న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. Photo : Twitter
ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, హిందీ భాషాల్లో కూడా మంచి ఆదరణ పొందుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విక్రమ్ ఓటీటీ హక్కులను హాట్ స్టార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తాజా బజ్ ఏమిటంటే, ఈ చిత్రం OTT ప్లాట్‌ఫారమ్‌లో జూలై 8, 2022న అందుబాటులోకి రానుందని సరికొత్త టాక్. అయితే ఇది దాదాపు ఖాయం అని అంటున్నారు. ఈ విషయంలో త్వరలో మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే విక్రమ్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డు సృష్టించింది. ఈ చిత్రం తాజాగా 400 కోట్ల క్లబ్లో చేరింది. రజనీకాంత్ 2.0 తర్వాత ఈ అరుదైన ఘనత సాధించిన 2వ తమిళ సినిమా విక్రమ్. ఈ సినిమా ఇప్పటి వరకు 404 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టింది. వీటిలో 120 కోట్ల రూపాయల వసూళ్లను ఓవర్సీస్ నుండి వచ్చాయి. Photo : Twitter
ఇక మరోవైపు ఈ చిత్రం తమిళనాడులో ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్లను బ్రేక్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ తమిళనాడు రాష్ట్రంలో 155 కోట్లు రాబట్టి కేక పెట్టించింది. ఇక కమల్ విక్రమ్ దాదాపుగా మూడు వారాల్లో 155 కోట్లకు పైగా రాబట్టింది. Photo : Twitter
దీంతో ఈ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద బాహుబలి 2 రికార్డ్‌ను బద్దలు కొట్టడంతో కమల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా తెలుగు కలెక్షన్స్ విషయానికి వస్తే.. తమిళ్ నుంచి తెలుగులోకి వచ్చిన చిత్రాల్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచి మంచి వసూళ్లను అందుకుంది. ఈ సినిమా తెలుగులో 27 కోట్లకు పైగా గ్రాస్‌ను 15.09 కోట్ల షేర్‌ను అందుకుని 7.50 కోట్ల టార్గెట్ కి డబుల్ ప్రాఫిట్‌తో 7.89 కోట్లతో డబుల్ బ్లాక్ బస్టర్‌గా కేక పెట్టించింది. Photo : Twitter
ఈ సినిమా మొత్తంగా 100 కోట్ల బిజినెస్ చేయగా.. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 78 కోట్లకు పైగా ప్రాఫిట్‌తో సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా తెలుగు రైట్స్‌ను యువ నితిన్ స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. Photo : Twitter