Kamal Haasan | విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నటించిన లేటెస్ట్ సినిమా (Vikram) ‘విక్రమ్’. ఈ సినిమాకు (Lokesh Kanagaraj) లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటించారు. మరో తమిళ నటుడు సూర్య (Suriya) కీలకపాత్రలో కనిపించారు. ఈ సినిమా జూన్ 3న విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. Photo : Twitter
ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, హిందీ భాషాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఇక ఈసినిమా థియేటర్ రన్ ముగియడంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. విక్రమ్ ఓటీటీ హక్కులను హాట్ స్టార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషాల్లో జూలై 8 నుంచి హాట్ స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది.. దీంతో మరోసారి ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కమల్ హాసన్ ఫ్యాన్స్. Photo : Twitter
ఇక అది అలా ఉంటే విక్రమ్ సంచలన విజయంతో కమల్ హాసన్ చాలా హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌తో పాటు తమిళనాట ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నారు. ఇప్పుడు క్రేజీ న్యూస్ ఏమిటంటే ఆయన త్వరలో 4 క్రేజీ సీక్వెల్స్‌లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఆయన భారతీయుడు 2 షూటింగ్లో పాల్గోనబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతో పాటు ఆయన సూపర్ హిట్ సైకో-థ్రిల్లర్ రాఘవన్ పార్ట్ 2 లో కూడా నటించనున్నారట. దీనికి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. Photo : Twitter