.ఆషికా రంగనాథ్ ప్రధానంగా కన్నడ భాషా చిత్రాలు ఎక్కువుగా చేసింది. ఆమె 2016లో కన్నడ చిత్రం క్రేజీ బాయ్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆమె అక్క అనూషా రంగనాథ్ కూడా నటి. ఆషికా రంగనాథ్ మిస్ ఫ్రెష్ ఫేస్ 2014లో రన్నరప్‌గా నిలిచింది. ఆషికా రంగనాథ్ ఆగస్టు 5, 1996లో జన్మించింది. ఈ భామ ప్రస్తుతం కళ్యాణ్ రామ్ అమిగోస్లో నటిస్తోంది. ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదలకానుంది.
అమిగోస్ విషయానికి వస్తే.. కళ్యాణ్ రామ్ (Kalyan Ram Amigos) ఆ మధ్య బింబిసార(Bimbisara)తో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ఆయన అమిగోస్ అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ అండ్ కాన్సెప్ట్‌తో వస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది
దీనికి ఎన్టీఆర్ (NTR) గెస్ట్‌గా వచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుంచి 2023లో వస్తోన్న మూడో చిత్రం. ఇప్పటికే విడుదలైన సినిమాలో మూడు పాత్రలకు సంబంధించిన కళ్యాణ్ రామ్ లుక్స్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
దీనికి ఎన్టీఆర్ (NTR) గెస్ట్‌గా వచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నుంచి 2023లో వస్తోన్న మూడో చిత్రం. ఇప్పటికే విడుదలైన సినిమాలో మూడు పాత్రలకు సంబంధించిన కళ్యాణ్ రామ్ లుక్స్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించారు. ఇప్పటికే సిద్దార్ధ్ అనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా.. మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ పాత్ర, మూడో పాత్ర మైఖేల్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించనున్నారు. ఇతను తనలాగే ఉండే మరో ఇద్దరినీ వెతికి పట్టుకుంటాడు. ఆ తర్వాత అతను వాళ్లను ఏం చేసాడనేదే ‘అమిగోస్’ మూవీ స్టోరీలా ఉంది. ఈ గ్యాంగ్‌స్టర్ ఈ ఇద్దరిని ఎలా వాడుకొని NIA కళ్లు కప్పాడనేదే ఈ సినిమా ట్రైలర్లో చూపించారు.
ఈ సినిమాలో హీరో కమ్ విలన్ పాత్రలో కళ్యాణ్ రామ్ నటన బాగుంది. ఇక మూడు పాత్రల్లో మూడు డిఫరెంట్ మ్యానరిజం చూపించాడు. రీసెంట్గా బింబిసారలో కూడా రెండు విభిన్న పాత్రల్లో అలరించిన ఈ నందమూరి హీరో.. ఇపుడు మరో డిఫరెంట్ పాత్రలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ యెకా యెకా ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎన్నో రాత్రులొస్తాయి’ అంటూ రీమిక్స్ సాంగ్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
బాబాయి నందమూరి బాలకృష్ణ హీరోగా దివ్యభారతి హీరోయిన్గా నటించిన ధర్మక్షేత్రం’ చిత్రానికీ ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. 1992 ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇళయరాజా స్వరాలు అందించారు. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో దివంగత వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ‘ఎన్నో రాత్రులొస్తాయి’ పాట అప్పటికీ ఇప్పటికీ ఎంతో పాపులర్. తాజాగా ఈ పాటను ‘అమిగోస్’లో రీమిక్స్ చేశారు
అప్పట్లో ఎస్పీ బాలు, చిత్ర పాడిన ఈ పాటను ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌తో పాటు సమీరా భరద్వాజ్ ఆలపించారు. గతంలో కళ్యాణ్ రామ్.. బాలయ్య నటించిన ‘రౌడీ ఇన్స్పెక్టర్’ .. ‘అరే ఓ సాంబ’ పాటను ‘పటాస్’లో రీమిక్స్ చేసి హిట్ అందుకున్నారు. ఇపుడు అదే బాటలో బాలయ్య సూపర్ హిట్ పాటలను ‘అమిగోస్’లో పెట్టారు. మరి సెంటిమెంట్ వర్కౌట్ అయి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.